జగన్ రెడ్డికి మీడియా అంటే నిజంగా భయమా…? లేక భక్తా..? అర్థంకాక సీనియర్ జర్నలిస్ట్ అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఆయన చర్యలు సొంత మీడియాకు సైతం చిరెత్తుకొస్తోంది.
జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియా ముందుకు ఒక్కసారి కూడా రాలేదు. అసలు ఆయనను నమ్మి వందల కోట్లు ఖర్చు చేసి గెలిచిన ఎమ్మెల్యేలకే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీడియా ఎంత..? అన్న సందేహం రావచ్చు. కానీ.., ఎవ్వరేమన్న ప్రపంచ వ్యాప్తంగా మీడియాపై ఆధారపడే ప్రభుత్వాలు నిలబడుతున్నాయి.. అదే మీడియా కారణంగా కూలుతున్నయన్నది అక్షర సత్యం. ఈ నేపధ్యంలో సొంత పార్టీ ముఖ్యనేతలకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినా…, ఇవ్వకున్నా.. మీడియాకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కానీ .., జగన్ రెడ్డి ఆ ప్రాధాన్యత, గురుతర బాధ్యతను మరిచి నాలుగునరేళ్ళు అయ్యింది.
ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధి మీడియా. ఆ మీడియాను జగన్ రెడ్డి అండ్ కో నిర్లక్ష్యం వహించింది. చిన్న చూపు చూస్తోంది. జర్నలిస్ట్ సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం ఏనాడో గాలికొదిలేసింది. ఏపీలో మీడియా ప్రతినిధుల పరిస్ధితి పతక స్ధాయిలో దారుణ స్ధితికి దిగజారింది. స్వాతంత్య్రానికి ముందు.., ఆ తరువాత మీడియా పాత్ర సమాజం కీలకమనే చెప్పాలి. ఆనాటి నుంచి నేటి వరకు దేశం ప్రగతికి మీడియా చేస్తున్న క్రియశీలక పాత్రను జగన్ రెడ్డి అండ్ కో గుర్తించకపోవడం శోచనీయం. అటువంటి మీడియాపై జగన్ రెడ్డి విషం చిమ్ముతున్నారు. జగన్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి వార్తలను నిర్భయంగా ప్రచురించిన.., ప్రసారం చేసిన మీడియా మాధ్యాలపై కత్తికట్టి.. ఈ నాలుగునరేళ్ళు ఆయన చూపిన వివక్షా.. అంతాఇంతా కాదు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు.., పెద్దఎత్తున జరుగుతున్న అవినీతి.., జగన్ లక్షల కోట్ల అవినీతి కేసుల్లో కోర్టులో 3,100 సార్లు పడిన వాయిదాలు.., ఐదేళ్ళుగా నడుస్తున్న కోడికత్తి కేసు.., వివేక హత్య.., విపక్ష నేత చంద్రబాబు, తెలుగు దేశం నేతలపై నమోదు అవుతున్న కేసులు, మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియా.. ఇలా చెప్పుకుంటేపోతే.. దాదాపు వందల ప్రశ్నలు మీడియా సంధిస్తున్న భయంతోనే జగన్ రెడ్డి మీడియాకు దూరంగా ఉంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీడియా ప్రశ్నలకు సమాధానాలు లేక.., వాడిని డిఫెన్స్ చేయలేక.. ఈ విధంగా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై.., మొహం చాటేస్తున్నారన్న విశ్లేషణలు లేకపోలేదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వానికి.., ప్రజల మధ్య బాగా డిస్టేన్స్ ఏర్పడుతోంది అన్నది వాస్తవం. అందుకే అధికార వైసీపీ.., జగన్ రెడ్డి పట్ల ప్రజలు వీసిగెత్తిపోయి వ్యతిరేకతను చాటుతున్నాన్నది తేటతెల్లమవుతోంది.











