ఏపి మంత్రి ఇలకాలో విద్యార్థులపై కుల వివక్ష..!
జగన్ రెడ్డి పాలనలో గడిచిన రెండేనరేళ్లలో కులాలు, మతాల మధ్య చిచ్చు రాజేసి.. చలికాచుకోవడం అలవాటే! అదే ఆనవాయితీ మంత్రులు కూడా అందిపుచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సాక్ష్యత్తు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సొంత నియోజకవర్గమైన రామచంద్రపురంలోని కె.గంగవరం మండలం బ్రహ్మపురిలో అగ్ని కుల క్షత్రియ విద్యార్థులపై కుల వివక్షను చూపి.. వారికి వేరే పాఠశాల కేటాయించడం వివాదస్పదమైంది. కండకావరం, అధికార దర్పంతో కేవలం అగ్నికుల క్షత్రియ విద్యార్థులకు ఒక పాఠశాల, ఇతర కులాలకు చెందిన విద్యార్థులందరికీ మరో పాఠశాలను విద్యాశాఖ అధికారులు కేటాయించి.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దారి తీసేలా తెరతీశారు. దీనిపై అగ్ని కుల క్షత్రియ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
దళితులపై వివక్ష మొదలైంది రామచంద్రపురం నుంచే..!
గతంలో కూడా తూ.గో జిల్లా రామచంద్రపురం దళితులపై దాడులు జరిగేవి! ఘోరంగా వివక్ష చూపేవారు!! అంతేకాక శిరోముండనం చేసి, తీవ్రంగా అవమానించే వారు అగ్రకులస్తులు! సరిగ్గా 25 ఏళ్లు క్రితం ప్రస్తుత వైసీపీ నాయకులు తోట త్రిమూర్తులు తొలి శిరోముండనం కేసులో ఏ1 గా ఉన్నారు. అలానే జులై 2020న రాజానగరం నియోజకవర్గం పరిధిలోని సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వైసీపీ నేతల ఇసుక మాఫియాకు అడ్డు తగిలాడని కవల కృష్ణమూర్తి దళిత యువకుడైన వరప్రసాద్ పై తీవ్రంగా దాడి చేసి, పోలీసు స్టేషన్ లోనే శిరోముండనం చేసిన సంగతి విదితమే.











