టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘ఇక మేము ముగ్గురం జనవరి 2021లో రాక’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఆయన అనుష్కతో ఉన్న పిక్ ను పోస్ట్ చేశారు. ఈ పిక్ లో అనుష్క ‘బేబీ బంప్’తో కనబడుతోంది. కోహ్లీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో క్షణాలలో వైరల్ అయింది. సెలబ్రిటీ కపుల్ కు అభిమానులు అందరూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
జనవరి నెలలో డెలివరీ అనుకుంటే అనుష్కకు ప్రస్తుతం ఐదో నెలగా అర్ధమవుతోంది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని మాకు ఎందుకు చెప్పలేదని నెటిజన్స్ అడుగుతూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి డిసెంబర్ 11 2017లో వివాహమాడారు. వివాహానికి ముందే చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట టాప్ మోస్ట్ సెలబ్రిటీ హోదా దక్కించుకుంది. టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషించిన విరాట్ ఆమె ప్రేమకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్వదేశీ మ్యాచులలోనే గాక విదేశాలలో కూడా ఆమె పలు మ్యాచ్ లకు హాజరైన సంగతి తెలిసిందే.
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020










