మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో లోకేష్ భేటీ కానున్నారు. అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదముద్ర వేసినందుకు 5 కోట్ల ఏపీ ప్రజల తరపున రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలపనున్నారు. గత ఐదేళ్లుగా అనిశ్చితిలో ఉన్న రాజధాని అంశానికి కేంద్రం, రాష్ట్రపతి ఆఫీస్ నుంచి లభించిన ఈ క్లియరెన్స్, కూటమి ప్రభుత్వానికి దక్కిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. అమరావతి నిర్మాణం కేవలం రాష్ట్రానికే పరిమితం కాదని, జాతీయ స్థాయి ప్రాజెక్ట్ అని లోకేష్ ఈ భేటీ ద్వారా మరోసారి చాటిచెప్పనున్నారు..
మరోవైపు రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసత్య ప్రచారాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కేంద్ర పెద్దలకు వివరించడంతో పాటు, కీలక విచారణల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఆశిస్తున్న సహకారంపై లోకేష్ చర్చించే అవకాశం ఉంది..
లోకేష్ ఢిల్లీ వెళ్లారంటే రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటుందనే ముద్ర ఉంది. ఈసారి కూడా తన శాఖలకు సంబంధించిన కీలక అంశాలను ఆయన సిద్ధం చేసుకున్నారు. కేంద్ర ఐటీ, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రులతో భేటీ అయి ఏపీలో రాబోయే భారీ ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా విశాఖ ఐటీ హబ్ అభివృద్ధి, అమరావతిలో నిర్మించబోయే ప్రతిష్టాత్మక నాలెడ్జ్ సిటీకి అవసరమైన కేంద్ర నిధులు మరియు అనుమతుల సాధనపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు..
ఈ పర్యటన..లోకేష్ వ్యక్తిగత ఇమేజ్‌ను కూడా నేషనల్ లెవల్‌లో మరో మెట్టు ఎక్కిస్తోంది. BJP హైకమాండ్‌తో ఉన్న వ్యక్తిగత సంబంధాలను రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవడంలో లోకేష్ సక్సెస్ అవుతున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పరిపాలనా సంస్కరణలు, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను ఢిల్లీ వేదికగా ప్రమోట్ చేస్తూ నాయకత్వ పటిమను చాటుకుంటున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు లోకేష్..











