యడ్డీ .. బొమ్మై .. మధ్యలో మురిగేష్..!
కర్నాటక రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేడర్ ల్లో రేగుతున్న అసంతృప్తి జ్వాలలకు చెక్ పెట్టడం చేతకాక చేతులెత్తిసిన అధిష్టానం .. ఇలా డిమాండ్స్ మేరకు కూర్చిలో తలకాయాలను మార్చుకుంటూ పోతే .. ఎలా అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇవి ప్రతిపక్షాలకు కూడా అస్త్రాలుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి మార్పు అనివార్యమని పార్టీ సీనియర్ నేత, మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కర్నాటక ముఖ్యమంత్రి మారబోతున్నారు. ఆయన స్థానంలో మంత్రి మురిగేష్ నిరాని బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇందులో ఎటువంటి అసత్య లేదు .. కానీ ఎప్పుడు మారుస్తారో అన్నది స్పష్టత ఇవ్వలేక పోతున్నానని ఆయన చెప్పారు. అయితే ఈశ్వరప్ప, నిరాని ఇరువురు బస్వారాజ్ బొమ్మై కేబినెట్ లో మంత్రులు గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జులై 28న యడ్యూరప్పను తొలగించి బొమ్మైను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టిన అధిష్టానం, ఈశ్వరప్ప వాఖ్యలతో ముఖ్యమంత్రి మార్పు తథ్యంలా కనిపిస్తోంది.
ఇలా మార్చుకుంటే పోతే ఆశావహుల లిస్ట్ చాంతాడేగా!
కేడర్ ల్లో ఒకరిపైఒకరు అవినీతి ఆరోపణలు, సీఎం పీఠం నుంచి దించేవరకు పోరాటాలు, అలకపాన్పులు, ఢిల్లీ గల్లీల్లో సిట్టింగ్గులు .. ఇది గడిచిన రెండునరేళ్ళల్లో అధికార బీజేపీ నెలకొన్న కన్నడ గ్రూప్ రాజకీయాలు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన తనయుడు పై సొంతపార్టీ నేతలే ప్రతిపక్షం కన్నా ఎక్కువగా తీవ్ర ఆరోపణలు చేసి కూర్చి నుంచి దించేవరకు విశ్రమించలేదు. తరువాత ఢిల్లీ నుంచి దూత వచ్చి.. ఏదో అలా సద్దుమణిగించి, అందరి ఆమోదంతో బొమ్మైను సీఎం కూర్చిలో కూర్చోపెట్టారు. ఎక్కిన 3 నెలలకే ఆయనపై ఆరోపణలు, విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఆయనను కూర్చినుంచి దించే వరకు మా పోరాటం, ఆరాటం ఆపేదే లేదని మరో ఓన్ పొలిటికల్ వార్ కు తెరతీశారు. కర్నాటక బీజేపీలో సీనియర్లు సీఎం పీఠం కోసం మూడు గ్రూపులుగా విడిపోయి .. ప్రతిపక్షాల కన్నా .. ఎక్కువగా కొట్టుకుంటున్నారు. పదవుల కోసం తన్నుకు చస్తూ .. పార్టీ పరువును రోడ్డుకీడుస్తున్నారు. సొంతపార్టీలో గ్రూప్ తగాదాలకు కేంద్రం త్వరగా చెక్ పెట్టకుంటే బలంగా ప్రతిపక్షంగా అత్యంత బలం చేకూర్చుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి.
Must Read ;- ఉత్తరాంధ్ర నుంచి రాజకీయ మార్పు.. టీడీపీలోకి వలసలు మొదలు!











