AP Polఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి షాక్ ఇచ్చేలా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీ రాజీనామా చేసి ఝలక్ ఇచ్చారు.
అధికార వైసీపీకి బిగ్ షాకిచ్చారు ఆపార్టీ ముఖ్య నేతలు. ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే.., జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవి, పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చిన ఆర్కే.. అంతర్గతంగా బలమైన కారణాలెన్నో ఉన్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీలో నెలకొన్న వర్గ విబేధాలు అధిష్టానం చక్కదిద్దకపోవడం.., మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి దాదాపు 1250 కోట్ల రూపాయలు కేటాయిస్తానన్న జగన్ రెడ్డి.., ఆ తరువాత మోహం చాటెయ్యడం వంటివి ప్రధాన కారణాల అని మరోవైపు చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం.. మూడు రాజధానులు అంశం తెరపైకి తీసుకొచ్చాం అని చెప్పుకుని వైసీపీకి విశాఖ జిల్లా కేంద్రంగా గట్టి షాక్ తగిలింది. గాజువాక ఎమ్మెల్యే కుమారుడు తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. దేవన్ రెడ్డి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న దేవన్ రెడ్డి.. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంట వ్యవధిలో ఆయన కూడా రాజీనామా చేయడం అధికార పార్టీలో కలవరం మొదలైంది. మరోవైపు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మద్దతుగా మంగళగిరిలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.
ముఖ్మమంత్రి జగన్ రెడ్డితో సుధీర్ఘ రాజకీయాల్లో కలిసి నడుస్తున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికే ఆ గతి పడితే.. మా పరిస్ధితి ఏంటీ అని లోకల్ గా ఉన్న వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు బుర్ర వేణుగోపాలస్వామి రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు వివేకానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్మదర్శి ఈదులమూడి డేవిడ్ రాజ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి.. ఇలా ఆల్ మోస్ పార్టీలోని కీలక నేతలందరూ పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేసి.. బయటకొచ్చారు. కీలక నేతల రాజీనామాలతో మంగళగిరిలో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యిందనే చెప్పాలి.











