పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆ రెడ్డిగారి చేతివాటానికి సామాన్యులు బెంబెలెత్తిపోతు న్నారు.
నిసిగ్గుగా ప్రజలను నుంచి నేరుగా లంచాలు డిమాండ్ చేస్తూ.. రోతపడుతున్న ఆ నేత సాక్ష్యాత్తు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా అంటేనే వెనుబడిన జిల్లా. అందులోనూ ప్రాంతాల అభివృద్ధి.., సామాజీకాభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. పరిశ్రమలు లేవు.., యువతకు ఉద్యోగాలు లేవు.., ఉద్యోగాలను సృష్టించే చర్యలు మచ్చుకైనా కనిపించవు. అటువంటి తరుణంలో ఇక్కడి ప్రజలందరూ వ్యవసాయంపై ఆధారపడి.., చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాను పోషించుకుంటుటారు. అంతటి దయనీయ పరిస్ధితిలో పల్నాడు వాసులు జీవనం సాగిస్తుంటే.. వారిపై రాబంధుల్లా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు పడి పీక్కుతినడం శోచనీయం.
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మేజారిటీతో సీట్లు సాధించింది. దీంతో జిల్లాలో మమ్మల్ని ఆపేది ఎవర్రా.. అంటూ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న భూ దందాలు, అవినీతి.., దౌర్జన్యకాండలు అన్నీఇన్నీ కావు. మాచర్ల, గురజాల, సత్తెనపల్లి,పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నియోజవర్గాల్లో ఎమ్మెల్యేలు, వారి బంధువులు సాగిస్తున్న అంతులేని అవినీతి ప్రజల పాలిట శాపం మారింది. భూదందాలు..,మైనింగ్ మాఫియా లీడ్ చేయడంలో అందెవేసిన చేయిలా సాగిస్తున్న అవినీతి సామ్రాజ్యం రైతుల పాలిట శాపంగా మారింది.
నరసరావుపేట నియోజకవర్గంలోని ఓ రైతుకు సంబంధించిన భూ వివాదంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి తలదూర్చి.. 16 లక్షలు డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది. సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేనే నిసిగ్గుగా ఇలా లంచం డిమాండ్ చేయడం సిగ్గు చేటని విపక్షాలు మండిపడుతున్నాయి. పేదలకు, రైతులకు రక్షణగా నిలవాల్సిన ఎమ్మెల్యేనే అలా లంచం డిమాండ్ చేయడం ఏమిటీ..? అని బాధితులు వాపోతున్నారు. తీవ్ర మసస్తాపని గురై బాధితులు తాడేపల్లి సీఎం క్యాపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించడం చర్చకు దారితీస్తోంది. దీనిపై విపక్షాలు మండిపడుతుండగా.. సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.