ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ సినిమాలు వరుసగా పరాజయం పాలవడంతో .. మంచు విష్ణు తదుపరి సినిమా విషయంలో కాస్తంత జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఆ క్రమంలో ఈ హీరో .. ఇప్పుడో థ్రిల్లర్ మూవీని తెరమీదకు తీసుకొస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ‘మోసగాళ్ళు’.మంచు విష్ణు, ఆర్. విజయ్ కుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఐటీ రంగంలో జరిగిన ఒక అతిపెద్ద స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అందాల కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో చేసిన ఒక ప్రసంగం పై టీజర్ ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే…. ఒక పెద్ద గొడౌన్ నిండా.. కరెన్సీ కట్టలు గోనె సంచుల్లో రివీల్ అవుతాయి. ఆ మూటల్ని చూస్తూ కాజల్ అగర్వాల్ .. ఇది సరిపోతుంది కదా.. అని అడుగుతుంది. దానికి మంచు విష్ణు ఆట ఇప్పుడే మొదలైంది అని సమాధానం చెబుతాడు. టీజర్ చూస్తుంటే.. విష్ణు, కాజల్ ఇద్దరూ తోడు దొంగలని .. ఆ స్కామ్ కి సూత్రధారులు వీరే అని అర్ధమవుతోంది. అతి త్వరలోనే విడుదల కానున్న ఈ మోసగాళ్ళు సినిమా విష్ణు, కాజల్ ఇద్దరికీ ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
మెసగాళ్ళు టీజర్ వీక్షించడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.