నాగచైతన్య, సమంత.. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ అనుకున్నారు అందరూ. అయితే.. ఏమైందో ఏమో కానీ.. విడిపోతున్నాం అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. కొంత మంది అయితే.. చై – సామ్ విడిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. అయితే.. విడాకుల తర్వాత సమంత స్పందించింది కానీ.. నాగచైతన్య మాత్రం స్పందించ లేదు. ఎప్పటిలానే తన వర్క్ తో బిజీ అయ్యాడు.
అయితే… ఈ సంక్రాంతికి బంగార్రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న బంగార్రాజు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నాగచైతన్యకు విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి.. మా ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం అది. తను సంతోషంగా ఉంది. నేను కూడా సంతోషంగా ఉన్నాను. మేమున్న పరిస్థితుల్లో ఇదే బెస్ట్ డెసిషన్. కలిసి నిర్ణయం తీసుకున్నాం అంటూ చైతన్య క్లారిటీ ఇచ్చాడు.
అయితే.. విడాకులకు కారణం ఏంటనేది మాత్రం నాగచైతన్య కూడా చెప్పలేదు. అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత విషయం కాబట్టి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే.. చైతూ స్టేట్ మెంట్ తో ఒక్క మేటర్ మాత్రం క్లియర్ అయింది. ఈ విడాకులతో అటు సమంత, ఇటు నాగచైతన్య ఇద్దరూ సంతోషంగానే ఉన్నారని. అదీ.. సంగతి.











