కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరిచిపోలేని చిత్రాల్లో సోగ్గాడే చిన్ని నాయానా ఒకటి. ఈ సినిమాకి ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా చేయాలని నాగ్ ఫిక్స్ అయ్యారు. టైటిల్ రిజిష్టర్ చేయడం ఎప్పుడో జరిగింది కానీ.. కథ నాగ్ కు సంతృప్తి కలిగించకపోవడం వలన ఆలస్యం అయ్యింది. దీంతో కళ్యాణ్ కృష్ణ కథ పై కసరత్తూ చేస్తునే ఉన్నారు. ఎట్టకేలకు కళ్యాణ్ కృష్ణ చేసిన మార్పులు చేర్పులు నచ్చడంతో నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాని ప్రారంభించారు. ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నారు.
అయితే.. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తుండడం విశేషం. నాగచైతన్య సరసన సమంత నటింనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో మరోసారి ఈ జంట స్ర్కీన్ పూ మాయ చేస్తారనుకున్న వారికి నిరాశే. కారణం ఏంటంటే.. ఇందులో నాగచైతన్య సరసన సమంత నటించడం లేదు. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ నుంచి నాగచైతన్య షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ సినిమా కోసం స్వర్గం సెట్ ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనం తర్వాత తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్లాన్. మరి.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా వలే బంగార్రాజు కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.
Must Read ;- ఏజెంట్ లో మమ్ముట్టి పాత్రను నాగ్ చేయాలనుకున్నారా?











