అక్కినేని అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ భారీ థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ నెల 12న ప్రారంభించారు. అఖిల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో మలయాళ అగ్రహీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మమ్ముట్టి ఈ సినిమాలో నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆయన పాత్ర ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అఖిల్ కి తండ్రి పాత్ర అని.. కాదు విలన్ క్యారెక్టర్ అని వార్తలు వచ్చాయి. ఆతర్వాత అసలు విషయం తెలిసింది. మమ్ముట్టి.. అఖిల్ కి గురువు పాత్ర పోషిస్తున్నారని.
అయితే.. సురేందర్ రెడ్డి ఈ కథని నాగార్జునకు వినిపించినప్పుడు.. మమ్ముట్టి చేస్తున్న పాత్రను.. తను చేస్తే ఎలా ఉంటుంది అని సురేందర్ రెడ్డిని నాగార్జున అడిగారని తెలిసింది. అయితే.. సురేందర్ రెడ్డి మాత్రం సున్నితంగా తిరస్కరించాడని టాక్. నాగ్ ఈ పాత్ర చేస్తే… ఏజెంట్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతాయి. అతే కాకుండా.. ఇది అఖిల్ సినిమాగా కాకుండా, నాగ్ సినిమాగా బయటకు వస్తుంది. ఆ ప్రభావం అఖిల్ కెరీర్ పై పడుతుందని సురేందర్ రెడ్డి సున్నితంగా నో చెప్పాడట. దీంతో నాగార్జున కూడా ఓకే అన్నారు.
అప్పుడు సురేందర్ రెడ్డి మమ్ముట్టి పేరు చెబితే ఓకే అన్నారట. అంతే కాకుండా… ఈ పాత్ర గురించి నాగ్ నే స్వయంగా మమ్ముట్టికి ఫోన్ చేసి చెప్పాడని, నాగ్ నుంచి ఫోన్ రావడంతో మమ్ముట్టి కూడా కాదనలేక వెంటనే ఓకే చెప్పారని సమాచారం.
Must Read ;- వైష్ణవ్ తేజ్ కి నాగ్ అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా.?