సమంత సూపర్ డీలక్స్ మాదిరిగానే దూసుకుపోతోంది. సినిమాల విషయంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా. ఇన్ స్టాగ్రామ్ ద్వారా సెలబ్రిటీలు మంచిగా ఆదాయం దండుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోకి సమంత కూడా వస్తుంది. ఇన్ స్టాలో సమంతకు 18 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆమె శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, నీలిమ గుణ నిర్మిస్తుండగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని టాకీ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయింది. సమంత నటించిన సూపర్ డీలక్స్ చిత్రాన్ని తెలుగులో అనువదించి ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదల చేశారు.
ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. సమంత చిత్ర రంగ ప్రవేశం చేసి దాదాపు పదేళ్లు అయ్యింది. హీరోయిన్ గా ఇంత లాంగ్విటీ ఉన్నవారు అరుదు. ఒకప్పుడు ఇలా ఉండేది. చాలా కాలం తర్వాత సమంత ఇంత కాలం హీరోయిన్ గా నిలదొక్కుకోగలిగింది. ఇప్పటికే ఆమె క్రేజ్ ఏమీ తగ్గలేదు. గ్లామర్ విషయంలోన అదే మెయింటెయిన్ చేస్తున్నారు. చాలా కంపెనీలు సమంతను బ్రాండ్ అంబాసిడర్ గానూ ఉపయోగించుకుంటున్నాయి. తమ బ్రాండ్లకు సోషల్ మీడియోలోనూ ప్రచారం చేయించుకుంటున్నారు. దీని కోసం ఆమెకు భారీ పారితోషికం ముడుతున్నట్టు సమాచారం. ఒక్కో ఇన్ స్టా పోస్టుకు ఆమె రూ. 25 లక్షల నుంచి 30 లక్షల దాకా వసూలు చేస్తున్నట్టు సమాచారం.
ఇన్ స్టా ద్వారా భారీగా సంపాదించేవారు చాలామంది ఉన్నారు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ, బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాలు ఇలాంటి సంపాదనలో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ కోవలోకి సమంత కూడా వస్తుందని అనుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ శాకుంతలంకు భారీగా డేట్స్ ఇచ్చిందామె. ఈ సినిమా షూటింగ్ 45 రోజుల క్రితం ప్రారంభమైంది. సమంతకు సంబంధించిన షూటింగ్ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. సాధారణంగా గుణశేఖర్ సినిమాల చిత్రీకరణ స్లోగా ఉంటుంది. అలాంటిది గుణశేఖర్ దూకుడు పెంచారు. తమిళంలో కూడా సమంత ఓ చిత్రం చేస్తోంది.