సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, హోం ఐసోలేషన్ లో ఉన్నానని బాలయ్య తెలిపారు. గడిచిన రెండురోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని బాలయ్య సూచించారు. అదేసమయంలో తన ఆరోగ్యం పట్ల అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.
బాలక్రిష్ణ కరోనా బారిన పడడం పట్ల ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బాలయ్య 107వ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుండగా.. ఆహా ఓటిటి లో ఆయన అన్ స్టాపబుల్ షో కూడా చేస్తున్నారు. కాగా ప్రస్తుతం బాలయ్య కరోనా బారిన పడడంతో ప్రోగ్రామ్ సీజన్ సెకండ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ టైమ్‌లో బాలకృష్ణకు కరోనా పాజిటివ్ రావడంతో షో కొనసాగుతుందా లేక ఏమైనా గ్యాప్ వస్తుందా అని ఆయన అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.