వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ వేదికగా విజయసాయి పరోక్షంగా తనపై చేసిన వ్యాఖ్యలకు అయ్యన్న ఘాటు విమర్శలు చేశారు.గత కొద్ది రోజులుగా టిడిపి నేతలపై వైసీపీ నాయకులు ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, విజయసాయి రెడ్డి మాత్రం స్థాయిని మరిచి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనాన్ని బయటపెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి అయ్యన్న పై విజయసాయి మరోసారి ట్విటర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే అయ్యన్న కూడా ధీటుగా జవాబిచ్చారు.
“16 నెలలు జైలులో చిప్పకూడు తినడం వల్ల శ్రీరామ మండపడింది. తోటి ఖైదీలు, పోలీసులు చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చాలు చూసుకొని విజయసాయి రెడ్డి పులి గా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్ళిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నాననడం విడ్డూరంగా ఉంది..” అని అయ్యన్న పేర్కొన్నారు.
అదేసమయంలో..”అంతా గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకుని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తెలిపోద్ది ఎవయాఉ పులో ఎవడు పిల్లో !. అంటూ తన ట్వీట్ ద్వారా అయ్యన్న విమర్శనాస్త్రాలు సంధించారు.