మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ పై స్పందించారు నారా లోకేశ్. అనిల్ కు నెల్లూరు సిటీ టికెట్ ఉందా..లేదా.? అన్న చర్చ జరుగుతుందని… ఫస్ట్ వైసీపీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలంటూ హితవు పలికారు. అభివృద్ధిపై చర్చకు తాను రెడీ అన్న లోకేశ్…. అసలు వైసీపీ సర్కార్ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి అనిల్ అవినీతికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటపెడతామన్నారు. అసలు అనిల్ కు నెల్లూరు సిటీ టికెట్ ఉందా..లేదా.? జగన్ హామీనిచ్చారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ప్రజలు అనిల్ ను ఓడిస్తారని… అనిల్ మొదట టికెట్ తెచ్చుకోవాలంటూ హితవు పలికారు. కార్పొరేట్ సీట్లు కూడా అనిల్ అమ్ముకున్నాడని ఆరోపించారు.
గతంలో వై ఎస్ వివేకాను తాము హత్య చేయలేదు అని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసాం, అనిల్ కుమార్ కి దమ్ము ఉంటె అవినీతికి పాల్పడాల్డాని ప్రమాణం చేసే దైర్యం ఉందా అని నారా లోకేష్ సవాల్ విసిరారు. నువ్వు అవినీతకి పాల్పడిన్నటు పెద్ద చిట్టా నా దగ్గర ఉంది త్వరలోనే జైలుకి పోవడానికి, అలాగే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని అనిల్ కుమార్ కి హెచ్చరించారు. వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతా కారణంగా ప్రజలు నన అవస్థలు పడుతున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ని అప్పుల కుప్పగా మార్చారని ఆవేదన వ్యక్తం చేసాడు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం మండిపడ్డారు. యువ గళం పాదయాత్రలో భాగంగా పాతూరు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే గత నాలుగేళ్లలో 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.











