టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టాడు. తిరుపతి ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాడు. జగన్ రెడ్డి కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి, 100 కొట్టేస్తున్నాడు. ప్రజా మద్దతు గెలిచిన ఆయన ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాడటం లేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు రోబోల్లా మారారని ఎద్దేవా చేశారు. కరెంటు, ఇంటి పన్ను, పెట్రోల్.. ఇలా అన్ని ధరలు పెంచుతూ పేదలను దోచుకుంటున్నాడని ఆరోపించారు. జగన్ రెడ్డికి ప్రజలే బుద్ది చెప్తారన్నారు.
Must Read ;- జగన్ బెయిల్ రద్దు చేయండి.. హైకోర్టులో ఎంపీ రఘురామరాజు పిటిషన్