దేశంలో భాషా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలైనా కర్ణాటక, తమిళనాడు, కేరళ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హిందీ విషయంలో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కొంత విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ఐతే తాజాగా లోకేష్ చేసిన ఓ ట్వీట్..దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఏ భాషైనా మాట్లాడండి, ఏ రకమైన దుస్తులైనా వేసుకోండి, ఫుడ్ విషయంలోనూ ఎలాంటి నిబంధనలు లేవు. ఇతురల సంప్రదాయాలను గౌరవిస్తాం. ఏపీకి రండి..అభివృద్ధిలో పాలు పంచుకోండి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో ఇండియాలోనే లోకేష్ కూలెస్ట్ పొలిటిషియన్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రధానంగా ఎక్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా లోకేష్ తీరును ప్రశంసించింది. అంతేకాదు ఉత్తరాదికి చెందిన అనేక మంది టెక్ నిపుణులు సైతం లోకేష్‌ను పొగుడుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు అరుదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ట్వీట్‌పై లోకేష్ సైతం స్పందించారు. నేనొక్కడినే కాదు తెలుగు ప్రజలంతా మంచి వారే అంటూ ట్వీట్ చేశారు. అభివృద్ధి మాత్రమే తెలుగు ప్రజల భాష అన్నారు లోకేష్. అభివృద్ధి కోరుకునే ఎవరైనా ఏపీకి రావొచ్చంటూ ఆహ్వానం పలికారు.











