ఏపీ లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్ జగనే..ఈ మాట అన్నది టీడీపీ, బీజీపీ,జనసేన నేత కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్. దీంతో లిక్కర్ స్కామ్ విషయంలో కాంగ్రెస్ కూడా చాలా సీరియస్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఎక్స్ వేదికగా స్పందించారు మాణిక్కం ఠాగూర్. ఈ కేసులో మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమేనన్నారు. అసలు సూత్రధారులు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ట్వీట్ చేశారు. అంటే లిక్కర్ స్కామ్ వెనకున్న జగన్, భారతీ రెడ్డిలేనని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ఓ పత్రికా కథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు.
ఈ స్కామ్ యాక్సిడెంటల్‌గా జరగలేదన్న మాణిక్కం ఠాగూర్..పక్కా ప్లాన్ ప్రకారం జగన్ అండ్ కో కథ అంతా నడిపించిందంటూ ట్వీట్ చేశారు. చాలా సైంటిఫిక్‌గా టాప్ – డౌన్ ఆపరేషన్ జరిగిందన్నారు. లిక్కర్ బ్రాండ్స్ పద్ధతిగా సెలక్ట్ చేసుకున్నారని, పక్కా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారని, ముడుపుల గురించి ముందే మాట్లాడుకున్నారని ఆరోపించారు. డమ్మీ కంపెనీలను సృష్టించారని, దోపిడీ కోసం పాలసీని మార్చేశారని వివరించారు.
ఎంపిక చేసుకున్న లిక్కర్ సప్లయర్స్‌తో జగన్ పార్టీ నేతలు సమన్వయం చేసుకున్నారన్నారు మాణిక్కం ఠాగూర్. ప్రముఖ బ్లాండ్లను పక్కకు తప్పించారన్నారు. అంత పెద్దగా ప్రాచుర్యంలో లేని బ్రాండ్లను తెచ్చారని, వాటిని అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకున్నారని వివరించారు. ఫేక్ ఇన్‌వాయిస్, సర్వీస్ కాంట్రాక్టులతో కమిషన్లను పక్క దారి పట్టించారని ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మనీ లాండరింగ్ చేశారని ఆరోపించారు. ముఖ్యంగా జగన్ దంపతులు, కొంత మంది మినిస్టర్లు, ఫ్రెండ్లీ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆరోపించారు.
2020–2024 మధ్య కనీసం 3,200 కోట్లు మళ్లించారని సిట్ చెబుతోందన్నారు మాణిక్కం ఠాగూర్. ఇందులో 2024 ఎన్నికల ప్రచారానికి ..నియోజకవర్గాలలో నగదు , ఉచిత మద్యం పంపిణీకి, ఓటు కొనుగోలు, బూత్ నిర్వహణ కోసం ఉపయోగించారన్నారు. మిథున్ రెడ్డి చీఫ్ ఆపరేటర్‌గా వ్యవహరించారని.. ఎక్సైజ్ శాఖ , రాజకీయ కార్యాలయాల మధ్య సమన్వయం చేయడంలో ఆయన సహాయం చేశారన్నారు.
జగన్‌కు ఇది మొదటి స్కామ్ కాదన్నారు మాణిక్కం ఠాగూర్. సీబీఐ నమోదు చేసిన 43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో ఆయన ప్రాథమిక నిందితుడిగా ఉన్నారని చెప్పారు. 2012లో అరెస్టు అయ్యి 16 నెలలకు పైగా జగన్ జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. జగన్‌కు అవినీతి కొత్త కాదు. ఆయన పనిచేసే విధానం అదేనేన్నారు. లిక్కర్ స్కామ్‌తో పాటు ఇసుక మాఫియా, మైనింగ్ అండ్ ల్యాండ్ అలాట్‌మెంట్ స్కామ్స్ జరిగాయన్నారు. కానీ ఈ స్కాములన్నింటి బాధితులు పేదలు, వాయిస్‌లేని ఓటర్లేనన్నారు మాణిక్కం ఠాగూర్.











