పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఏపీలో పెట్టుబడులు పెట్టందుకు రెడీగా ఉంటే..తక్కువ ధరకే భూమిని అందిస్తామంటూ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన ఇప్పుడు గేమ్ ఛేంజర్‌గా మారింది. దీంతో చాలా కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో పర్యటించి అవకాశాల గురించి కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.
తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ ఏపీకి రానుందని చెప్పారు. అంతేకాదు అమెరికా బయట అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయనుందని చెప్పారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఇందుకోసం మధురవాడలో దాదాపు 500 ఎకరాలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య MOU సైతం జరిగింది. ప్రాజెక్ట్ ముందుకు సాగుతున్న కొద్ది అదనపు భూమిని కేటాయించనున్నారు.
గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజాల రాకతో ఏపీ రూపు రేఖలు మారుతాయని, ఐటీ విప్లవానికి కొత్త దారులు తెరుచుకుంటాయన్నారు చంద్రబాబు. గూగుల్ విశాఖలో అడుగుపెడితే…డేటా ఎనలైటిక్స్ లో ప్రపంచానికే విశాఖ కేంద్రంగా మారబోతోందని ఆయన చెప్పారు. అదే సమయంలో ఏఐ అక్యూరసీతో ఈ డేటా ఎనలైటిక్స్ ఉండబోతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు











