నర్సారావుపేట బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ‘‘అసూయకి అన్నలాంటివాడు జగన్‌రెడ్డి. అందుకే నాన్న, బాబాయ్‌కి టికెట్ తీసి పంపేశాడు. మరోసారి ఆయన అసూయతో రగిలిపోతున్నారు. ఈసారి గుండెపోటు తల్లికో? చెల్లికో?’’ అని నారా లోకేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘జగన్‌రెడ్డి చేతకాని పాలన, అవినీతి దాహం, బంధుప్రీతివల్ల ఆయన పార్టీ నేతలూ బలవుతున్నారన్న ఆయన రోడ్లపై పడిన గుంతే వైసీపీకి చెందిన కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపీపీ ప్రసన్నలక్ష్మి ప్రాణం తీసిందని అన్నారు. అంబులెన్సుల్లో వందల కోట్లు దోచేందుకు విజయసాయిరెడ్డి అల్లుడికి జగన్‌రెడ్డి కట్నంగా ఇచ్చేశాడని లోకేష్ విమర్శించారు.ప్రమాదం జరిగిందని అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే సాయిరెడ్డి అల్లుడి అంబులెన్స్ రాకపోవడం వల్లనే ప్రసన్నలక్ష్మి ప్రాణాలు విడిచిందని ఆయన తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సపొందే వారి పట్ల జగన్ యముడిలా దాపురించారన్న లోకేష్.. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ప్రసవం చేయించారంటే ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి, నులకపేటల్లో లోకేశ్ పర్యటించారు. ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే....