June 6, 2026 4:33 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

నరేంద్ర మోదీ: లోయ నుంచి శిఖరానికి..

భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అశేష భారత ప్రజలు అభిమానించే నాయకుడిగా తన అస్తిత్వాన్ని తనే నిర్వచించుకున్న మోదీ జన్మదినం సందర్భంగా లియోన్యూస్ ప్రత్యేకవ్యాసం.

September 17, 2020 at 7:41 AM
in General, Latest News, National, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నరేంద్ర మోదీ.. ఈ పేరు ఓ ప్రభంజనం.. వివాదాల మయం. అభివృద్ధికి తారక మంత్రం.. అంతులేని పట్టుదలకు పర్యాయపదం. వైరుధ్యాల సమాహారం.. స్థిరమైన నాయకత్వానికి రూపం. ఓ మారుమూల పల్లెటూళ్లో వెనుకబడిన కుటుంబంలో పుట్టిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా ఎదిగిన వైనం ఓ వ్యక్తిత్వ వికాస పాఠం. నేడు 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాల సమాహారం..

మే 16, 2014.. వందల ఏళ్ల చరిత్ర ఉన్న భారత జాతీయ కాంగ్రెస్‌పై ఓ చాయ్‌వాలా చిరస్మరణీయ విజయం సాధించిన రోజు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ ఓ బడుగు నేత చారిత్రక విజయం సాధించిన రోజు. కాంగ్రెస్ పార్టీకి, నరేంద్ర మోదీకి మధ్య జరిగిన ఎన్నికల యుద్ధం ఫలితం వచ్చిన రోజు. సాధారణ కార్యకర్త కూడా ప్రధాని స్థాయికి ఎదగొచ్చనే భారత ప్రజాస్వామ్య గొప్పదనం ప్రపంచానికి తెలిసిన రోజు.. నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ.. ఆ రోజు సాధించిన విజయం వెనుక ఎంతో కృషి ఉంది.. కష్టం ఉంది.. అవమానాలున్నాయి.. తిరస్కారాలున్నాయి. వాటిని అధిగమించుకుంటూ పైకెదిగిన ధీరోదాత్తత ఉంది.

సెప్టెంబర్ 17, 1950.. స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకు బొంబాయి రాష్ట్రంలోని (ప్రస్తుత గుజరాత్‌) మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక ఓ వెనుకబడిన కుటుంబంలో నరేంద్ర మోదీ జన్మించారు. మూల్‌చంద్ మోదీ, హీరాబెన్ మోదీకి మూడో సంతానమైన మోదీ చిన్నతనం నుంచే తండ్రికి సహాయపడుతూ ఉండేవారు. వాద్‌నగర్ రైల్వేస్టేషన్‌లో తండ్రితో కలిసి టీ అమ్మేవారు. అనంతరం తన సోదరుడితో కలిసి ఓ టీస్టాల్‌ను కూడా నడిపారు. ఎనిమిదేళ్ల వయసులో మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వైపు ఆకర్షితులయ్యారు. స్థానికంగా జరిగే శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అక్కడే తన రాజకీయ మార్గనిర్దేశకుడు లక్ష్మణరావు ఇనామ్‌దార్‌ను కలిశారు. 80వ దశకంలో గుజరాత్‌లో బీజేపీకి పునాదులు వేసిన నాతాలాల్ జగ్దా, వసంత్ తదితరులతో అక్కడే పరిచయాలు పెంచుకున్నారు. చిన్నవయసులోనే మోదీకి తన కులానికే చెందిన యశోదా బెన్‌తో వివాహం జరిగింది. అయితే ఆరెస్సెస్ విధానాల పట్ల ఆకర్షితుడైన మోదీ ఆమెతో కలిసి జీవించలేదు. 2014 ఎన్నికలకు ముందు మోదీ స్వయంగా తను వివాహితుడినని చెప్పేవరకు ఆ విషయం బయటకు రాలేదు. 

25 జూన్, 1975.. ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. దాదాపు 21 నెలలపాటు కొనసాగిన ఎమర్జెన్సీ సమయంలోనే నరేంద్ర మోదీ గుజరాత్‌లో రాజకీయంగా ఎదిగారు. ప్రత్యర్థి పార్టీ నాయకులందరినీ నిర్బంధిస్తున్న ఆ సమయంలో మోదీ `గుజరాత్ లోక్ సంగ్రాహ సమితి` ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. మారు వేషాల్లో రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలను పంచేవారు. ఆ సమయంలోనే మోదీ `సంఘర్ష్ మా గుజరాత్` పుస్తకాన్ని రాశారు. ఎమర్జెన్సీ ముగిశాక ఆరెస్సెస్ తరఫున పనిచేసేందుకు ఢిల్లీ వెళ్లారు. అనంతరం గుజరాత్ తిరిగి వచ్చి ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 1987 అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రధాన నాయకుల దృష్టిలో పడ్డారు. గుజరాత్ బీజేపీ యూనిట్‌కు కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎంపికయ్యారు. 

అక్టోబర్ 7, 2001.. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశూభాయ్ పటేల్ అనారోగ్యం పాలవడం మోదీకి కలిసి వచ్చింది. కేశూభాయ్ అధికార దుర్వినియోగం, అవినీతి, భుజ్ భూపంకం అనంతరం సరిగ్గా స్పందించకపోవడం వంటి కారణాలతో  2001లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కొన్ని సీట్లు కోల్పోయింది. దాంతో కొత్త అభ్యర్థి కోసం బీజేపీ నాయకత్వం అన్వేషణ మొదలుపెట్టింది. బీజేపీ జాతీయ నాయకులుగా ఉన్న ఎల్‌కే అద్వాని, వాజ్‌పేయి దృష్టిని మోదీ ఆకర్షించారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను అప్పగిస్తూ మోదీని ముఖ్యమంత్రిని చేశారు. 

ఫిబ్రవరి 27, 2002.. అయోధ్య నుంచి తిరిగి వస్తున్న హిందూ భక్తులతో కూడిన రైలు గోద్రా వద్ద తగలబడింది. దాదాపు 60 మంది హిందువులు ఆ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా స్థానిక ముస్లింలు చేసిన తీవ్రచర్యగా ముఖ్యమంత్రి మోదీ అభివర్ణించారు. ఆ తర్వాతి రోజు విశ్వహిందూ పరిషత్ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ ముసుగులో ముస్లింలపై దాడులు జరిగాయి. గోద్రాలో మరణించిన వారి శరీరాలను అహ్మదాబాద్‌కు తరలించాలనే ప్రభుత్వం నిర్ణయం ఆగ్నికి మరింత ఆజ్యం పోసింది. ముస్లింలపై దారుణ మారణ కాండకు కారణమైంది. ఎందరో చిన్న పిల్లలు మరణించారు. మరెందరో మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఆ ఘటనలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2000 మంది వరకు మరణించి ఉంటారని, 1.50 లక్షల మంది బాధితులుగా మారారని అనధికారిక సమాచారం. ఆ ఘటన మోదీపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. జాతీయ, అంతర్జాతీయ వ్యాప్తంగా మోదీపై విమర్శలు వెల్లువెత్తాయి. మోదీని ముఖ్యమంత్రిగా కొనసాగించవద్దని డీఎంకే, టీడీపీ వంటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నుంచి డిమాండ్లు వచ్చాయి. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం మాత్రం మోదీ వైపే నిలబడింది. వారి అంచనాలను నిజం చేస్తూ 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మోదీ మరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. డిసెంబర్ 22, 2002న రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2014 వరకు అప్రతిహతంగా గుజరాత్‌ను పాలించారు. గుజరాత్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. 

పదేళ్ల కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలతో విసిగిన దేశ ప్రజలు నరేంద్ర మోదీ వైపు ఆకర్షితులయ్యారు. అద్భుతమైన వక్త అయిన మోదీ తన వాక్చాతుర్యంతో ప్రజలను తన వైపు తిప్పుకున్నారు. అనుకున్నట్టుగానే 2014 ఎన్నికల్లో భారీ విజయం సాధించి ప్రధాని పదవిని అధిష్టించారు. అయితే అభివృద్ధి జపం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ ఆ తర్వాత హిందుత్వను ప్రోత్సహించారు. `హిందీ, హిందూ, హిందూస్తాన్‌` అనే ఆరెస్సెస్ విధానంతోనే ముందు కెళుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సహచరుడు అమిత్ షాకు కీలక బాధ్యతలు అప్పగించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండాను రెపరెపలాడించారు. మోదీ అమలు పరిచిన పెద్ద నోట్ల రద్దు తీవ్ర వైఫల్యాన్ని చవిచూసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. ఇక, లౌకిక వాదులపై దేశవ్యాప్తంగా జరిగిన దాడులు తీవ్ర భయాందోళనలకు కారణమయ్యాయి. అయితే మోదీ తొలి ఐదేళ్ల పాలనలో కుంభకోణాలు లేకపోవడం,  తీవ్రవాద దాడులు వంటివి జరగకపోవడం, విదేశాల్లో భారత్ పరపతి పెరగడం, అతుకుల బొంత ప్రభుత్వం కాకుండా బలమైన నాయకత్వం ఏర్పడడం ప్రజల దృష్టిని ఆకర్షించారు. 

మోదీ-షా ద్వయం..

సమాజాన్ని కులపరంగా విడగొట్టి కొన్ని పార్టీలు లాభపడితే, మోదీ-షా ద్వయం మతపరంగా విడగొట్టి ప్రయోజనం పొందింది. 2014 ఎన్నికల్లో  అభివృద్ధి మంత్రం, గుజరాత్‌ మోడల్‌, నల్లధనం వెనక్కి రప్పించడం గురించి మాట్లాడిన మోదీ.. 2019 ఎన్నికలకు వచ్చేసరికి స్వరం మార్చేశారు. జాతీయవాదాన్ని ముందుకు తెచ్చారు. దాని ముందు మిగిలిన వైఫల్యాలన్నీ పక్కకు పోయాయి. ప్రతిపక్షం బలంగా ఉండి ఉంటే 2019 ఎన్నికల్లో బిజేపీని ఓ మేరకు అడ్డుకోగలిగేవారేమో. రాహుల్ గాంధీ నాయకత్వం మోదీకి వరంగా మారింది. బీజేపీకున్న సంస్థాగత నిర్మాణం, ఆరెస్సెస్‌ కార్యకర్తలు, మోదీ నాయకత్వం 2019 ఎన్నికల్లో బీజేపీకి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టాయి. ప్రత్యర్థుల విమర్శలనే తన విజయసోపానాలుగా మార్చుకోవడం మోదీకి వెన్నతోపెట్టిన విద్య. దిగ్విజయ్ సింగ్ `చాయ్‌వాలా` విమర్శను కూడా మోదీ తన గెలుపునకు చక్కగా ఉపయోగించుకున్నారు. ఆ పేరుతో ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. సైనిక విజయాలను చాకచక్యంగా తన ఖాతాలో వేసుకుని వాటిని పదేపదే ప్రస్తావించడం కూడా మోదీ తరచుగా చేస్తున్నారు. 

ఏదేమైనా ఇందిరా గాంధీ తర్వాత ఆ స్థాయి బలమైన నాయకుడు మోదీనే. ఏళ్ల తరబడి వివాదాస్పదంగా మారిన ఆయోధ్య విషయంలో అందరినీ ఒక తాటిపైకి తెచ్చిన మేధావి. ఆర్టికల్ 370ని సునాయాసంగా రద్దు చేసిన మొండి ఘటం. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించాల్సి వచ్చినపుడు మోదీ మాట మీద దేశం మొత్తం నిలడింది. దాని వల్ల ఉపయోగం ఉందా, లేదా అనే సంగతి పక్కన పెడితే వంద కోట్ల మందిని ప్రభావితం చేయగల సమ్మోహన శక్తి మోదీ సొంతం అనేది స్పష్టమైంది. ఇంతటి బలమైన నాయకత్వం, బలమైన ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ మరింత బలమైన దేశంగా ఎదిగే వైపుగా అడుగులు వేస్తే ఎంతో మంచిది. నేడు 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మోదీ ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.

Tags: indian prime ministerleotopnarendra modinarendra modi 70th birthday
Previous Post

సత్తెనపల్లిలో కోడెల స్థానం భర్తీ చేసేదెవరు?

Next Post

తెలంగాణ విమోచనం  : పోరు తెలంగాణకు జెండాపండగ

Related Posts

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Malavika Mohanan Hot pics

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

అభిమానికి నాగార్జున జూమ్ కాల్

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist