నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక నిశ్చితార్థం నగరంలో వైభవంగా జరిగింది. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమె వివాహం నిశ్చయమైంది. వధువు- వరుడి కుటుంబాలకు చెందిన అతి కొద్దిమంది ముఖ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నగరంలోని ట్రైడెంట్ హోటల్ లో ఈ కార్యక్రమం జరిగింది.

మెగా కుంటుంబ సభ్యులందరూ పాల్గొన్న ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ కనిపించలేదు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. వేడుక తర్వాత… కొన్ని ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. వాటిలో ఎక్కడా పవన్ కల్యాణ్ కనిపించలేదు.

పవన్ కల్యాణ్ అసలు కార్యక్రమానికి హాజరు కాలేదా? లేదా.. వచ్చి ఫోటో సెషన్ వరకూ ఉండకుండా వెళ్లిపోయారా? అని మెగా ఫ్యామిలీ అభిమానులు చర్చించుకుంటున్నారు. నాగబాబు.. పవన్ కల్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీలో కూడా ముఖ్య నాయకుడిగా ఉంటున్నారు. నిజానికి తమ్ముడి రాజకీయా ప్రస్థానంలో కుటుంబం నుంచి అండగా ఉంటున్నది నాగబాబు ఒక్కరే. అలాంటిది పవన్ కల్యాణ్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా ఉంది.












