అందాల ముద్దుగుమ్మను చూస్తే ఎవరికైనా మతి చలిస్తుంది. అలాంటిది ఆ ముద్దుగుమ్మకు కూడా మతి చలించిపోయేలా చేసే జీవులుంటాయని అప్పుడప్పుడూ మనకు కనిపిస్తుంది. ఆ ముద్దు గుమ్మ రష్మిక మందన్న అయితే ఆ జీవి మాత్రం ఓ కుక్క పిల్ల. అఫ్ కోర్స్.. మనుషులకన్నా కుక్కల్నే ఎక్కువగా ప్రేమించేవారు మన సమాజంలో తక్కువేమీ లేరు. కాకపోతే ఓ కుక్క పిల్లకు ఆ మహాద్బాగ్యం లభిస్తే చూసిన వారికి నేను కుక్క పిల్లనై పుట్టినా బాగుండు అనిపించకపోదు.
ఏదేమైనా ముద్దొచ్చినప్పుడే చంక నెక్కాలి అని ఈ కుక్క పిల్లకూ బాగా అర్థమైనట్టుంది. ఎంచక్కా రష్మికతో ముద్దులు కూడా పెట్టించేసుకుంటుంది. ‘పడ్డానండీ ప్రేమలో మరీ’ అన్నట్టు రష్మిక ఫోటోలు షేర్ చేసేస్తుంటే ఎవరితో చెప్మా అనుకుంటూ ఆత్రంగా ఆ ఫొటోలు చూసిన వారికి రష్మక ముద్దుచేస్తున్న కుక్కపిల్ల ఫొటోలే కనిపిస్తున్నాయి. ఆ స్థానాన్ని భవిష్యత్తులో ఎవరు భర్తీచేస్తారోగానీ ఈ పెట్ మాత్రం జాక్ పాట్ కొట్టేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
‘ఇప్పుడున్న ఇబ్బందికర పరిస్థితుల్లో నాకు ఎంతో ఆనందాన్ని నా లిటిల్ పెట్ ఇస్తోంది. దీన్ని మీకు పరిచయం చేస్తున్నా’ అంటూ రష్మిక తన అభిమానులకు ఈ కుక్క పిల్ల ఫోటోలను షేర్ చేసింది. ఆమె నట్టింట్లో దిగిన ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ కాకుండా ఎలా ఉంటాయి. ఇంత స్వీటు వయసులో అంత ఘాటు ప్రేమ కుక్క పిల్లతో ఉంటే ఎవరికి మాత్రం ఈర్ష్యగా ఉండదు చెప్పండి. ఈ విషయంలో సరిలేరు ఈ భామకెవ్వరూ అనుకోవలసిందే. సినిమాలను పక్కన పెట్టేసి కుక్క పిల్లతో ఎంచక్కా ఎంజాయ్ చేసేస్తోంది.
Must Read ;- అతడే నా హీరో : ధోనీపై మనసు పారేసుకున్న రష్మిక
View this post on Instagram











