తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటల వైదొలిగిన నాటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ నెట్టింట సరికొత్త చర్చకు దారితీసింది. ఓ పత్రికా కథనాన్ని ఆధారం చేసుకుని.. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’… కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం… యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…? అంటూ ఆ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇరకాటంలో మంత్రి, ఎమ్మెల్యేలు
మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను కర్నాటకలోని హంపీలో జరినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్), కొంతమంది పార్టీ నాయకులు హాజరైనట్టు.. అక్కడ పార్టీ గురించి చర్చించుకున్నట్లు ఆ కథనంలో ఉంది. ముఖ్యంగా కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు, ఈటల కొత్త పార్టీ, టీఆర్ఎస్ కార్యాకలాపాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే వీటి ఆధారంగా ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం, అది కాస్త వైరల్ కావడంతో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడినట్టు తెలుస్తోంది.
Must Read ;- టీపీసీసీని తేల్చే పనిలో అధిష్టానం.. రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి
‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’…
కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం…
యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…?! pic.twitter.com/iyJxAx07gj— Revanth Reddy (@revanth_anumula) June 8, 2021











