రష్మిక మంధాన.. వరుస సక్సెస్ లతో తెలుగులో దూసుకుపోతున్న హీరోయిన్. కర్రహీరోలతో పాటు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేస్తూ టాలీవుడ్ పై తనదైన ముద్ర వేస్తోంది. అందుకే రష్మికకు ఎక్కడాలేని ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. తన ఆందం, అభినయంతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. మరి అలాంటి బ్యూటీకి ఎవరంటే ఇష్టమో తెలుసా.. ఇంకేవరు ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. ‘తనే నా హీరో అని’ రష్మిక మనసులోని మాట బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఆర్‌సీబీ జట్టు అభిమానులతో ముచ్చటిస్తూ రష్మిక అసలు విషయం చెప్పింది. ఇష్టమైన జట్టు ఆర్సీబీ అని, కానీ అభిమాన ఆటగాడు మాత్రం ధోనినే అని చెప్పింది. కీపింగ్, బ్యాటింగ్.. రెండింటిలోనూ ప్రాణం పెట్టి ఆడతాడని, ధోనినే నా హీరో అని ఆకాశానికి ఎత్తేసింది.
Must Read ;- రామ్ చరణ్ సరసన కథానాయికగా రష్మికా మందన్న?












