ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాల హడావిడిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అయ్యాయి. వాటిలో ఆచార్య సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దీని తర్వాత చెర్రీ.. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.
దిల్ రాజు నిర్మాణంలో జూలై నెల్లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసుందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమంత్రిగా నటించబోతున్నాడట. శంకర్ గతంలో అర్జున్ తో తీసిన ఒకే ఒక్కడు తరహాలో సాగే.. ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అంటున్నారు. అంతేకాదు.. దీనికి ఓ రేంజ్ లో బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నారట. అలాంటి ఈ సినిమాలో చెర్రీ సరసన కన్నడ బ్యూటీ రష్మికా మందన్న కథానాయికగా ఎంపికైందనే టాక్ వినిపిస్తోంది.
కథ బాగా నచ్చడంతో.. ఈ సినిమాకి రష్మికా భారీ ఎత్తున డేట్స్ ఇచ్చిందట. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మికా ఇప్పుడు చెర్రీతో నటిస్తూండడం ఆసక్తి గా మారింది. ఇందులో ఆమె జర్నలిస్ట్ గా నటించబోతోందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కేస్టింగ్ ను ఫైనలైజ్ చేస్తున్నాడట శంకర్. అది పూర్తయిన వెంటనే.. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమవుతుందట.
Must Read ;- మెగా పవర్ స్టార్ నెక్స్ట్ డైరెక్టర్ ఇతడేనా?











