నటి శ్రీదేవి పేరు వినగానే ఆమె అందంతోపాటు ఆమె డ్యాన్సులే గుర్తుకొస్తాయి. శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. జాన్వీ నటించిన రూహి సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులోని ‘నదియా పార్’ అనే పాట మాత్రం పెద్ద హిట్ అయ్యింది. ఈ పాట వీడియో సాంగ్ యూట్యూబ్ లో విడుదలై 210 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టింది. డ్యాన్సుల్లో తల్లి వారసత్వాన్ని జాన్వి నిలబెట్టేసిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా బెల్లీ డ్యాన్సుల్లో జాన్వీ మంచి మార్కులు కొట్టేసింది. ఆ మధ్య జాన్వీకపూర్ తన సోషల్ మీడియాలో బెల్లీ డాన్స్ వీడియో ఒకదనిని షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘సన్ సనన.. ‘ అనే పాటకు నడుం ఊపుతూ జాన్వీ వేసి బెల్లీ స్పెప్పులు చూస్తే కుర్రకారు మనసు చెదిరిపోయింది. ఆ తర్వాత ఈ బెల్లీ డ్యాన్సును రూహిలో చూశారు. 2018లో ‘దఢక్’ చిత్రంతో జాన్వీ బాలీవుడ్ లో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా బాలీవుడ్ లో ఫ్లాప్ అయ్యింది.
అయినా జాన్వీకి అవకాశాలు ఏమాత్రమూ తగ్గలేదు. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, ‘గుంజన్ సక్సేనా’ ది కార్లిల్ గర్ల్, రూహి చిత్రాలు చేసింది. ప్రస్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ షూటింగ్ దశలో ఉన్నాయి. రూహి విడుదలయ్యాక జాన్వీ మెస్మరిజం జనానికి అర్థమవుతోంది. జాన్వీని నదియా పార్ పాటలో చూస్తుంటే టెంప్టింగ్‌గా ఉంది. సోనీ మ్యూజిక్ ఇండియా కంపెనీ ఈ పాటను విడుదల చేసింది. Let the music play అనే ఫేమస్ పాప్‌సాంగ్ ఇమిటేషన్‌తో ఈ పాటను రూపొందించారు.
గ్రూప్‌డాన్సర్స్‌తో జాన్వీ చేసిన డాన్స్ మూమెంట్స్ చూసిన వారికి శ్రీదేవి గుర్తొచ్చింది. రూహీ హారర్ కామెడీ కథ. అందుకే మాస్ ఆడియన్స్ దృష్టిని ఉంచుకుని ఈ పాటను చేశారు. ఇందులో జాన్వీ బెల్లీ డ్యాన్స్ మూవ్ మెంట్స్, ఆమె కళ్లలో పలికిన ఎక్స్‌ప్రెషన్స్ అభిమానుల మనసు దోచేశాయి. ఇప్పుడు దక్షణాది దర్శక నిర్మాతల దృష్టి కూడా జాన్వీ మీద పడింది. ఈ పాటతో జన్వీ దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Must Read ;- సింగిల్ పీస్ బికినీలో ఒంపుసొంపుల వయ్యారి











