జీవితాన్ని ఎవరూ ఒక కోణంలోనే చూడ కూడదు. రెండో కోణం కూడా ఉంటుంది. షకీల పేరు వినగానే ఆమె హాట్ భామగా అందరూ చూస్తారు.. కానీ తాను హాట్ భామ అనే విషయాన్ని నిరూపించిందామె. ఈ హాట్ ఆ హాట్ కాదు.. కరోనా కష్ట కాలంలో ఆకలితో ఉన్న నిరుపేదలకు వేడి వేడి వంటకాలతో భోజనం పెడుతోంది. ప్రచార పటాటాపాలకు పోకుండా తన వంతు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోయింది షకీల. ఓ శృంగార తార ఈ టైపు సేవా కార్యక్రమాలు చేయడం అందరినీ ఆకర్షిస్తోంది.
లాక్ డౌన్ కారణంగా రోడ్డు పైనే జీవించే వారి కడుపును షకీలా నింపుతోంది. ఆ ఫోటోలను ఆమె ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో పాటు ఆమె ఓ సందేశాన్ని కూడా అందించింది. ‘మీకున్న రెండు చేతుల్లో ఒకదాన్ని మీకోసం ఉపయోగించండి. మరో చేతిని నిరుపేదల కోసం ఆపన్న హస్తంగా మార్చాలి’ అంటూ ఆమె సందేశాన్ని కూడా పోస్టు చేసింది. ఆమెలో ఇంతటి మానవతా కోణం దాగి ఉందని ఇప్పుడు రుజువైంది.
ఆకలితో ఉన్న వాడికే మరొకరి ఆకలి గురించి తెలుస్తుంది. నిజానికి సినిమా తారగా షకీల పెద్దగా సంపాదించుకున్నది కూడా ఏమీ లేదు. అయినా ఆమె ఇలా స్పందించడం మాత్రం విశేషమే. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు. ఇలాంటి పనికి షకీల పూనుకోవడం అభినందనీయం. ఆమె చేస్తున్న ఈ పనికి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.
Must Read ;- యాంకర్ గా, నటిగా ఎంతో ఎదిగిన అనసూయ