కరోనా కౌగిలిలోంచి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ బయటకు వస్తోంది. షూటింగులకు కేంద్రం ఇప్పుడిప్పుడే నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తోంది. పెద్ద హీరోలు కొందరు కెమెరా ముందుకు రావడానికి అప్పుడే సాహసించకపోతున్నప్పటికీ.. ఇన్నాళ్లు ఖాళీగా ఉండిపోయిన బిజీస్టార్లు మళ్లీ జూలు విదల్చుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని చిత్రపరిశ్రమల్లో వాంటెడ్ గా ఉండే కేరక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా కెమెరా ముందుకు వచ్చేశారు. ఆయ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం అయింది. భారీ అంచనాలతో రూపొందుతున్న కేజీఎఫ్ 2 చిత్రం కోసం సన్నివేశాల షూటింగ్ లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.
‘‘స్టార్ట్ కెమెరా యాక్షన్.. బ్యాక్ టూ వర్క్’’ అంటూ ప్రకాష్ రాజ్ ఈ ముమెంట్ ను ట్వీట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ సన్నివేశం దృశ్యాలను కూడా ఆయన ట్వీట్ లో పోస్ట్ చేశారు.
Start Camera..Action… BACK TO WORK.. pic.twitter.com/LzFFhJrsjG
— Prakash Raj (@prakashraaj) August 26, 2020











