సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేశారంటూ ఇందిర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (సాక్షి టీవి) ప్రతినిధులకు ఎంపీ రఘురామకృష్ణంరాజు లీగల్ నోటీసులు పంపారు. ఇందిర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్ పర్సన్, ఏపీ సీఎం జగన్ భార్య వై ఎస్ భారతి రెడ్డి, బోర్డు డైరెక్టర్లకు, చీఫ్ ఎడిటర్ నీమని భాస్కర్, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులకు లీగల్ నోటీసులు పంపారు.తన ప్రతిష్టకు భంగం కలిగించనందుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ రఘురామరాజు తరఫున ఆయన లాయర్ పీవీజీ ఉమేష్ చంద్ర వారికి నోటీసులు పంపారు. వారంలోగా క్షమాపణలు చెప్పకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏఏ సందర్భాలలో తనను అవమానపరుస్తూ కథనాలు ప్రసారం చేసింది ఆయన వివరంగా పేర్కొన్నారు.














