టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీస్ లో అంజలి ముందు వరుసలో ఉంటుంది. తెలుగులో ఆమెకి సరైన గుర్తింపు రాలేదనే కొరత తప్ప.. అవకాశాలు అందుకోవడంలో ఆమె ఎప్పుడూ వెనుకబడలేదు. తమిళ ఇండస్ట్రీలో కథానాయికగా పేరు తెచ్చుకున్నాక అంజలి తన మకాం మదర్ వుడ్ టాలీవుడ్ కు మార్చిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోల సరసన కథానాయికగా అంతగా అవకాశాలు అందుకోలేకపోయినప్పటికీ.. తన స్థాయికి తగ్గ రీతిలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది.
అలాంటి ఈ సుందరి లేటెస్ట్ గా పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ లో అందరూ గుర్తుంచుకోదగ్గ రీతిలో పెర్ఫార్మ్ చేసి.. మరిన్ని అవకాశాలు అందుకొనే పొజీషన్ కు చేరుకుంది. ప్రస్తుతం అంజలికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే ఈ సుందరి ఇప్పట్లో పెళ్ళిమాత్రం చేసుకోనని దీక్ష బూనింది. అవునండీ.. ఆమె ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెడుతుందట.
తన ఈడువాళ్ళైన ప్రణీత సుభాష్, యామీ గౌతమ్ లాంటి బ్యూటీస్ .. రీసెంట్ గా పెళ్ళిచేసుకొని వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. కానీ అంజలి మాత్రం ఇప్పట్లో పెళ్ళ చేసుకోనని చెబుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ విషయంలో అమ్మడికి అనుష్క శెట్టి ఇన్స్పిరేషనో ఏమో తెలియదు . మరి తర్వాతైనాఈ తెలుగమ్మాయికి పెళ్ళిమీదకి ధ్యాస మళ్ళుతుందేమో చూడాలి.
Must Read ;- హాట్ నెస్ లో రాటు తేలిన తెలుగమ్మాయి !