గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుకుంటున్న బాలికను ప్రేమ పేరుతో భానుప్రసాద్ అనే యువకుడు వేధించడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంచలనంగా మారింది. గత కొన్నేళ్లుగా భానుప్రసాద్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాలిక చనిపోయే ముందు మీడియాకు తెలిపింది. తన చావుకు తల్లిదండ్రులు కారణం కాదని, కేవలం భానుప్రసాద్ వేధింపుల భరించలేకే గడ్డి మందు తాగానని బాలిక వెల్లడించింది. గడ్డి మందు తాగిన బాలికను తొలుత సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. బాలిక మృతికి కారణమయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులను ఆదేశించారు.
Also Read: సత్తెనపల్లిలో కోడెల స్థానం భర్తీ చేసేదెవరు?