పీలేరు జైలులో ఖైదీగా ఉన్న జడ్జి రామకృష్ణ ఆరోగ్య పరిస్థితులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామరాజు గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్‌కు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణ బీపీ, షుగర్ వ్యాధులతో బాధ పడుతున్నారని, ఆయన్ను పీలేరు సబ్ జైలు నుంచి వైద్యం అందించేందుకు తిరుపతిలోని ఆసుపత్రికి తరలించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆవేదన అర్థం చేసుకుని వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు రాసిన లేఖలో రఘురామరాజు విజ్ఙప్తి చేశారు.
ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. భీమవరం ఆక్వా రంగానికి కేంద్రంగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఆక్వా పరిశ్రమ వృద్ధికి ఇంటిగ్రేటెడ్ వర్సిటీ ఏర్పాటు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు.
Must Read ;- చిత్తూరు జైల్లో జడ్జి రామకృష్ణ హత్యకు కుట్ర : వర్ల రామయ్య











