ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజద్రోహం కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టైన జడ్జి రామకృష్ణను చిత్తూరు సబ్ జైలు నుంచి ఇవాళ ఉదయం పీలేరు జైలుకు తరలించారు.చిత్తూరు సబ్ జైలులో తన తండ్రి జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని తనయుడు వంశీకృష్ణ హైకోర్టుకు,జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.దీంతో జడ్జి రామకృష్ణతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన పీలేరు కోర్టు అధికారులు ఆయన కోరిక మేరకు పీలేరు సబ్ జైలుకు తరలించారు.చిత్తూరు సబ్ జైలులో రామకృష్ణ బ్యారక్‌లో మరో ఖైదీను ఉంచారు.అతను చంపుతానంటూ బెదిరించాడని,అతని బెడ్ షీట్ కింద కత్తి కూడా దొరకడం వివాదంగా మారింది.దీంతో జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ తన తండ్రికి జైలులో ప్రాణహాని ఉందని హైకోర్టుకు లేఖ రాసిన విషయానికి బలం చేకూరడంతో ఆయనను పీలేరు జైలుకు తరలించారు.
బెయిల్‌పై రేపే విచారణ
జడ్జి రామకృష్ణ బెయిల్ పిటీషన్ హైకోర్టులో రేపు విచారణకు రానుంది.రాజద్రోహం కేసులో ఏప్రిల్ 17 నుంచి జైలులో ఉన్న జడ్జి రామకృష్ణ తరఫు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు.ఆ పిటీషన్ హైకోర్టులో రేపు విచారణకు రానుంది. జడ్జి రామకృష్ణ దళితుడు కావడం వల్లే మంత్రి పెద్దిరెడ్డి,సీఎం జగన్మోహన్‌రెడ్డి వేధిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.ఈ నేపధ్యంలో జడ్జి రామకృష్ణను హుటాహుటిన పీలేరు జైలుకు తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Must Read ;- చిత్తూరు జైల్లో జడ్జి రామకృష్ణ హత్యకు కుట్ర : వర్ల రామయ్య










