రాజద్రోహం సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులో చిత్తూరు జైలులో ఉన్న జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందంటూ తనయుడు వంశీకృష్ణ హైకోర్టుకు లేఖ రాసిన మరుసటి రోజే మరో ఘటన చోటు చేసుకుంది.జడ్జి రామకృష్ణ బ్యారక్‌లో మరో ఖైదీని ఉంచారు.అతని బెడ్ షీడ్ కింద ఇవాళ కత్తి బయటపడింది.దీంతో జడ్జి రామకృష్ణ తనయుడు చేసిన ఆరోపణలకు బలం చేకూరుతోంది.తన తండ్రిని జైల్లో బెదిరిస్తున్నారని సీఎం జగన్మోహన్‌రెడ్డి,మంత్రి పెద్దిరెడ్డిపైనే ఆరోపణలు చేస్తావా అంటూ బెదిరిస్తున్నారని వంశీకృష్ణ హైకోర్టుకు లేఖ రాసిన మరుసటి రోజే రామకృష్ణ బ్యారక్‌లో కత్తి వెలుగు చూసింది.దీంతో జడ్జి రామకృష్ణ వ్యవహారం మరోసారి వార్తల్లోకొచ్చింది.
జూన్ 3న విచారణ
జడ్జి రామకృష్ణ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేశారు.జూన్ 3న బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది.అయితే ఈ లోపే తన తండ్రికి జైల్లో ప్రాణహాని ఉందని కుమారుడు వంశీకృష్ణ హైకోర్టుకు తెలిపారు.అయితే దీనిపై ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.ఈ లోగా కేసు విచారణ జరిగితే బెయిల్ వస్తుందా రాదా అనే విషయం కూడా తేలుతుంది.ఈ లోగా జడ్జి రామకృష్ణకు ప్రాణహాని లేకుండా చూడాలని తనయుడు వంశీకృష్ణతో పాటు, ప్రతిపక్షనాయకులు జైళ్ల శాఖ ఐజీకి లేఖ రాశారు.
Must Read ;- కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా.. జగన్ బెయిల్ రద్దుపై విచారణ జూన్ 1కి వాయిదా











