చిత్తూరు జైల్లో జడ్జి రామకృష్ణ హత్యకు పెద్ద కుట్రే జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.మంత్రి పెద్దిరెడ్డి,మాజీ జడ్జి నాగార్జునరెడ్డి,ఈశ్వరయ్యతోపాటు ఈ కుట్రలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి కూడా భాగం ఉందన్నారు.జడ్జి రామకృష్ణ బతికి ఉండటం వారికి ఇష్టం లేదని,అందుకే చిత్తూరు జైల్లోనే అంతమొందించాలని స్కెచ్ వేశారని వర్ల రామయ్య అనుమానం వ్యక్తం చేశారు.జడ్జి రామకృష్ణ బ్యారక్‌లో ఉన్న ఖైదీ వద్ద కత్తి దొరకడం ఇందుకు నిదర్శనం అన్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
జడ్జి రామకృష్ణకు చిత్తూరు జైల్లో ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీ,కలెక్టర్‌కు సమాచారం పంపినా కనీసం స్పందించలేదని వర్ల రామయ్య మీడియాకు తెలిపారు.జైల్లో జడ్జి రామకృష్ణకు ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.జూన్ 3న హైకోర్టులో జడ్జి రామకృష్ణ బెయిల్ పిటీషన్ విచారణకు వస్తుందని,ఈ లోగా ఆయన ప్రాణాలకు రక్షణ కల్పించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Must Read ;- జడ్జి రామకృష్ణ బ్యారక్‌లో ఖైదీ వద్ద కత్తి