తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఆయుఆరోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ట్వీట్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విష్ చేస్తూ… చంద్రబాబు నాయకత్వంలో పార్టీ మరింత ముందుకెళ్లాలని, ప్రజల ఆశీస్సులతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పథంలో నడపాలని అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. అచ్చెన్నాయుడితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
Must Read ;- నడిచే లైబ్రరి,పోరాటమే ఊపిరి.. విజన్ ఉన్న నేత చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.@ncbn
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2021