రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తరువాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రభాస్ తో సినిమా తియ్యాలంటే మినీమమ్ 300 కోట్లు నుంచి 1000 కోట్లు బడ్జెట్ పెట్టాల్సిందే అంటున్నారు సినీ జనాలు. ఈ నేపథ్యంలోనే బాహుబలి 2 తరువాత ప్రభాస్ హీరోగా చేసిన సాహో సినిమాకి భారీగా ఖర్చు చేశారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. అయితే అనుకోకుండా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. దాదాపు 450 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాకు హిందీలో తప్పితే ఎక్కడా లాభాలు రాలేదు.
దాదాపు 250 కోట్ల రూపాయలు యూవీ క్రియేషన్స్ వారు చవిచూడాల్సి వచ్చింది. ఈ బ్యానర్ లో ప్రభాస్ కూడా పార్టనర్ అవ్వడంతో ఈ నష్టాన్ని ప్రభాస్ కూడా భరించాల్సి వచ్చింది. సాహో కోసం తీసుకున్న ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేయడానికి ప్రభాస్ అండ్ టీమ్ చాలా కష్టపడాల్సి వచ్చిందని అంటున్నారు. దీనికి తోడు ప్రభాస్ తో మళ్లీ యూవీ వారు రాథే శ్యామ్ అనే సినిమా చేస్తున్నారు దీనికి కూడా దాదాపు 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు, ఇప్పటికే 100 కోట్లు ఖర్చు చేశారు. అయితే రాథేశ్యామ్ షూట్ కొనసాగాలంటే యూవీ వారికి ఇంకా 200 కోట్లు అవసరం ఉంది. ఈ డబ్బుని తీసుకురావడానికి స్వయంగా ప్రభాస్ రంగంలోకి దిగాడు,
వరసగా సినిమాలు సైన్ చేసి అడ్వాన్ తీసుకుని రాథే శ్యామ్ షూటింగ్ కి కావాల్సిన నిధుల సమకూరుస్తున్నాడు. ఇప్పటికే వైజయంతి మూవీస్ వారితో సినిమా సైన్ చేసిన ప్రభాస్ తాజాగా టీ సిరీస్ వారు తీస్తున్న ఆధి పురుష్ లో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు. వీటితో పాటు రాక్ లైన్ వెంకటేశ్ నిర్మాణంలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీకి కూడా ప్రభాస్ తాజాగా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు సమాచారం. ఏదైమైనా రెండేళ్లకి గానీ ఓ సినిమా సైన్ చేయని ప్రభాస్ ఇప్పుడు ఎన్ని తిప్పులు పడుతున్నాడో అనే కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ క్లబ్ లో తెగ వినిపిస్తున్నాయి











