తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలిగా ముద్రపడిన శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె కర్ణాటకలోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. జ్వరంతో పాటు, ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను శివాజీనగర్ లోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కోవిడ్ వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
జయలలిత నెచ్చెలి శశికళ.. అక్రమాస్తులకు సంబంధించిన కేసులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఆమె విడుదల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో పలుమార్పులు చోటుచేసుకుంటాయని కూడా పలువురు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో- మరికొన్ని రోజుల్లో శశికళ జైలునుంచి విడుదల కాబోతున్నదనగా.. ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.
కొవిడ్ వార్డులో ఉంచి ఆమెకు డాక్టర్లు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నారు.
Must Read ;- తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే











