కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సస్ సాధించి అందర్నీ ఆకట్టుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఆతర్వాత ఏకంగా విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని తెరకెక్కించి.. ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. బంధాలు, అనుబంధాల ప్రాముఖ్యతను తెలియచెప్పి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
శ్రీకాంత్ అడ్డాల వర్క్ నచ్చడంతో మహేష్ మరో అవకాశం ఇచ్చాడు. అదే బ్రహ్మోత్సవం. అయితే.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ‘నారప్ప’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో విజయం సాధించిన అసురన్ మూవీ రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
అయితే.. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల.. ప్రముఖ నిర్మాత, ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాల తనయుడును హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి కూచిపూడి వారి వీధి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.
Must Read ;- విక్టరీ వెంకటేశ్ కి ‘లక్కీ కీ’ దొరికిందా?











