తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన రణరంగంగా మార్చిన వ్యక్తి ఒక IPS ఆఫీసర్ అని చాలామందికి తెలియదు. రిషాంత్ రెడ్డి సుపేరెండెంట్ అఫ్ పోలీస్ , ఆయానిక నియంత, న్యాయం, చట్టం లెక్క చేయని ఒక మూర్కపు పోలీస్ ఆఫీసర్. అధికార పార్టీ, అధికార పార్టీ నాయకులకి కొమ్ముకాయడమే ఈయనపని. రిషాంత్ రెడ్డి పేరు ఈ మధ్య దేశం మొత్తం మారుమోగిపోయింది. దానికి కారణం ఆయన పకడ్బందీగా కొమ్ము కాసి, చంద్రబాబు పర్యటనని రణరంగంగా మార్చిన కసాయి పోలీస్. ఆయన వేసిన ప్లాన్ వల్ల ఎందరో అమాయకులు బలి కావాల్సి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన సందర్భంగా జరిగిన రాళ్ల దాడిలో కనీసం 10 మంది పోలీసులు, డజనుకు పైగా వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీ టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
ఒక్కరో ఇద్దరో కాదు, ఏకంగా పదుల సంఖ్యలోనే గాయపడ్డారు. ఒక వైపు సామాన్య ప్రజలు, మరో పక్క పోలీసులు, ఇలా వైసీపీ కోసం ఎందరినో బలితీసుకున్న మహానుభావుడు రిషాంత్ రెడ్డి. జగన్ కనుసన్నులో పనిచేసే ఈ రిషాంత్ రెడ్డి గురించి కొన్ని దారుణమైన సంఘటనలు ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు మనం సినిమాలలో మాత్రమే చూసాం రౌడీ పోలీసులని ఈయన నేర చరిత్ర చుస్తే అవాక్కవల్సిందే.
రిషాంత్ రెడ్డికి ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని అంత తేలికగా వదలడు.ఎదో ఒక కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తాడని తెలిసింది. రిషాంత్ రెడ్డి బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందరో రౌడీలని ఎన్కౌంటర్ చేసాడని, అవి సమాజానికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడని తెలుస్తోంది. రిషాంత్ రెడ్డి ఏది చేసిన ఒక ప్లాన్ ప్రకారం అమలు పరుస్తాడని తెలుస్తోంది. మొన్న ఈ మధ్య జరిగిన సంఘటనని ఉదాహరణగా చెప్పొచ్చు. ఎంతో ప్రశాంతంగా టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనని శుభప్రదం చేయాలనే ఆలోచనలో ఉంటె, రోడ్ షో లో టీడీపీ నాయకులని కాపు కాసి దొరికిన వాళ్ళని దొరికినట్లు చితకబాదారు. దీనికి తోడు వైసీపీ నాయకులూ కూడా తోడుకావడంతో టీడీపీ నాయకులకి ఎం చేయాలో తెలియని అయోమయం స్థితిలో వీళ్ళు వేసిన ఉచ్చులో చిక్కుకొని చావు దెబ్బలు తిన్నారు.
అసలు ఈ రిషాంత్ రెడ్డి ఎవరు? ఎక్కడనుండి వచ్చాడు? ఆయన బాక్గ్రౌండ్ ఏంటి అని ఆరా తీస్తే. రిషాంత్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి అని తెలిసింది. ఆయన మొదట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడని, అది నచ్చక ఐపీఎస్ కి ప్రిపేరయి మంచి రాంక్ సాధించి IPS పాస్ అయ్యాడని తెలుస్తోంది. మంచి తెలివిగలవాడు. చురుకైనవాడు కూడాను.
పుంగనూరులో కావాలనే టీడీపీ ర్యాలీని టార్గెట్ చేసి హింసాకాండ సృష్టించాడని తెలిసింది. ఇంతకు ముందు కూడా ఆయన పని చేసిన గుంటూరు జిల్లాలో కూడా టీడీపీ ర్యాలీలను ఇలాగె విధ్వంసం సృష్టించాడని తెలుస్తోంది. ర్యాలీలో రిషాంత్ రెడ్డి కొట్టిన దెబ్బలకు కొందరికి కాళ్ళు చచ్చుబడి పోయాయని సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే రిషాంత్ రెడ్డి లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అయితే రిషాంత్ రెడ్డి, టీడీపీకి అజ్ఞాత శతృవుల తయారయ్యాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రిషాంత్ రెడ్డి భయంకరంగా రెచ్చిపోతున్నాడని తెలుస్తోంది.. పుంగనూరు ఘటనతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ దాకా తన పేరు మారుమోగేలా చేసాడు రిషాంత్ రెడ్డి.