ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయం రణరంగంలా మారబోతుంది. ముంపు గ్రామాలలో ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక వైపు, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మరో వైపు సందర్శించనున్నారు. దీంతో గోదావరి జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వెడ్డెక్కింది.
ఇలా ఒకేసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు కూడాను ముంపు గ్రామాలను సందర్శిస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.. టీడీపీ వైసీపీ నాయకులలో గోదావరి జిల్లాలో ఎం జరగబోతోంది అని ఎంతో ఉత్కంఠతో ఉన్నారు..
వరద పీడిత నాలుగు గోదావరి జిల్లాల్లో సోమవారం నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో వరద బాధితులతో చంద్రబాబు నాయుడు అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలతో సంభాషించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరులో పర్యటించనున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టిసం గ్రామంలో టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి నాయుడు ప్రసంగిస్తారు. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
ఏఎస్‌ఆర్‌లో దాదాపు 250 గ్రామాలు అతలాకుతలమై రోడ్డు కనెక్టివిటీకి అంతరాయం ఏర్పడింది. ఏలూరులోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు, పశ్చిమగోదావరిలోని 10 లంక గ్రామాలు, కోనసీమలోని పలు మండలాలు ముంపునకు గురయ్యాయి.
చింతూరు మండలంలోని కొన్ని మారుమూల గ్రామాల ప్రజలు తమ గ్రామాలను 41.15 మీటర్ల కాంటూర్‌లో చేర్చి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా పరిగణించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జలదీక్ష చేపట్టారు. గోదావరి వరదల్లో ఆయా జిల్లాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.