‘రేసుగుర్రం’, గబ్బర్ సింగ్, బలుపు, కాటమరాయుడు’ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుంది శ్రుతి హాసన్ . ప్రస్తుతం ఆమె మరోసారి హీరో రవితేజతో ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. తాను యాక్టర్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా. అనేక సినిమాల్లో తన పాటతో ప్రేక్షకులను మెప్పించింది. సినిమా విషయం పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ చుట్టూ అనేక వివాదాలు తిరిగాయి.
తాజాగా ఒక జాతీయ స్థాయి ఇంటర్వ్యూలో తను అనని మాటలను అన్నానని దక్షిణాది ఇండస్ట్రీలపై తప్పుగా మాట్లాడానని కొంత మంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని, ఆ వార్తల్లో అసలు ఎలాంటి నిజమూ లేదని శ్రుతి క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ చెయ్యడం తన సినీ జీవితాన్ని మలుపు తిప్పిందని, అంతే కాకుండా తెలుగులో ‘రేస్ గుర్రం’, ‘బలుపు, ‘కాటమరాయుడు’ లాంటి హిట్ చిత్రాల్లో నటించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. తాను ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా తెలుగు వర్సెస్ హిందీ అన్నట్టుగా చెప్పలేదని తెలిపింది. ఇంటర్వ్యూ చేసిన వాళ్లు హిందీ సినిమా కోసం అడిగితే కేవలం హిందీ సినిమా కోసం చెప్పానే కానీ ఎక్కడా తెలుగు సినిమాను, సౌత్ ఇండియన్ సినిమాను తక్కువ చేసి మాట్లాడలేదని ఆమె క్లారిటీ ఇచ్చింది.











