మంగళవారం నాడు ప్రధానిని కలవడానికి అపాయింట్ మెంట్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి.. మోదీతో భేటీ అయ్యారు. ఆయన వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. వీరి కీలకభేటీ ఎన్డీయేలోకి వైసీపీ ప్రవేశం గురించే అనే ప్రచారం తొలినుంచి ఉన్నప్పటికీ.. వివరాలు ఇంకా తెలియరాలేదు.
సీఎం జగన్ వెంట మోదీని కలిసిన బృందంలో రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ తో పాటు, జాస్తి చలమేశ్వర్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో.. ప్రధాని మోదీతో అనేక విషయాలు చర్చించారని, ఈ సందర్భంగా మిగిలిన రాష్ట్రాలు పట్టుబడుతున్నట్లుగా జీఎస్టీ చెల్లింపుల కోసం ఒత్తిడి చేయవద్దని మోదీ కోరినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.