హైదరాబాద్ వస్తే కలుస్తాను సార్ – సోన్సూద్
అసెంబ్లీలో చంద్రబాబుకు, ఆయన సతీమణికి జరిగిన అవమానం పై దేశ వ్యాప్తంగా ఉన్న సామాజీక, రాజకీయ, సినీ రంగ ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కొందరూ అధికారపార్టీ ఎమ్మెల్యే, మంత్రులు వాడిన భాషను, వ్యక్తిగత దూషణలను ఖండించారు. మరికొందరూ చంద్రబాబుకు నేరుగా కాల్ చేసి పరామర్శించారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫోన్ చేసి పరామర్శించగా .. సోన్సూద్ కూడా ఈ విషయంపై స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి చట్టలు చేయవల్సిన చట్ట సభల్లో ఇలాంటి వ్యక్తిత్వాన్ని కించపర్చే చర్చలకు తావివ్వడం విచారకరమని వాపోయ్యారు. హైదరాబాద్ వస్తే, మిమ్మల్ని తప్పకుండా కలుస్తాని చంద్రబాబుకు చెప్పారు. కాగా ఎన్నో ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక వడిదుడుకులను ఎదుర్కొన్న చంద్రబాబు… అపజయాలను, అవమానాలను సైతం చాలా నిగ్రహంగా, నిర్భయంగా ఎదురొడ్డి నిల్చిచారు. సతీమణి భువనేశ్వరిని అనరాని మాటలు అనడంతో తట్టుకోలేక బోరున విలపించారు. ఈ ఘటనను చూసిన ప్రతిఒక్కరూ కంటతడిపెట్టుకున్నారు.











