ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల వేళ మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హ** కేసు ప్రచారంలోకి వస్తోంది. ఈ కేసుకి సంబంధించి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డినే స్వయంగా ఎన్నికల ప్రచార సభలో చిన్నాన్న వివేకాను ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసునని.. దేవుడికి తెలుసునని వ్యాఖ్యానించారు. వివేకాను చంపించిన వారితో తమ చెల్లెల్లు సహాయం పొందుతున్నారని అన్నారు. అదే సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత మాట్లాడుతూ నాన్న వివేకాను ఎవరు చంపారో జగన్ అన్నకు తెలుసునని.. నాన్నను చంపిన వారికే తిరిగి ఎంపీ టికెట్ ఇచ్చి ప్రజలను ఓట్లు అడగటానికి వస్తున్నారని.. ఇదేక్కడి న్యాయమని ప్రశ్నించారు. వారి నాన్నను హ** చేసిన వైసీపీ అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రజలకు సునీత విజ్ఞప్తి చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి తానే పోటీ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా కడప ప్రజలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి విడిపోయి ఓట్లు వేయాల్సి వస్తోందని బాధపడ్డారు. ఇలా సొంత చెల్లెల్లు జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తరుణంలో .. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ ఎవరి వైపు..? కొడుకు జగన్ వైపా? లేకపోతే కూతురు షర్మిల వైపా? లేదంటే వివేకాను చంపిన అవినాశ్‌రెడ్డి వైపా..? చెప్పాలని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నకు విజయమ్మ సమాధానం చెబుతారా? అనే సందేహంలో ప్రజలు ఉన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ ఎవరి వైపు..? కొడుకు జగన్ వైపా, కూతురు షర్మిల వైపా, లేదంటే వివేకాను చంపిన అవినాశ్‌రెడ్డి వైపా..? చెప్పాలని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి డిమాండ్ చేశారు. కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హ** జరిగిందని షర్మిల స్పష్టంగా చెప్పారని.. చిన్నాన్నను చంపిన వారినే వైసీపీ పోటీకి పెట్టినప్పుడు తాను పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని.. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారన్నారు. విజయమ్మను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానని.. మీ ఇద్దరు బిడ్డలు వారి పార్టీల తరపున మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు వైఎస్ సమాధి వద్దకు వెళ్లారు కదా.. నీబిడ్డ అని చెప్పుకొనే జగన్… రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల పోటీ చేస్తున్నారు.. వైఎస్‌కు ఆత్మ ఉంటే తన కూతురు వైపు నిలబడతాడా నిలబడరా..? తమ్ముడు వివేకాను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తన కూతురుపై పోటీకి నిలబెడితే వైఎస్ ఆత్మ ఎంత క్షోభిస్తుందో పులివెందుల ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని అన్నారు. విజయమ్మ..మీరు కూతురు షర్మిల వైపు ఉంటారా? లేదా మీ కొడుకు, కోడలు మాటలు విని మీ మరిదిని చంపిన అవినాశ్ వైపు ఉంటారా..? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని… కనీసం పులివెందుల వాసులకైనా చెప్పాలని కోరారు. తన కుమారుడు జగన్‌కు ఒక్కసారి ముఖ్యమంత్రి అందలం ఎక్కే అవకాశం ఇవ్వాలని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన వైఎస్ విజయమ్మ.. మాజీ ఎంపీ వివేకా హ** కేసులో నెలకొన్న గందరగోళంపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని లోక్‌సత్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు.