తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలన రేపుతోంది. గత ఏడాది నవంబర్‌లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు .. ఎస్‌ఐబీలో ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడిన పోలీసు అధికారులు విచారణలో వెల్లడించారని విచారణ అధికారులు ప్రకటించారు. ఇప్పుడు అదే తరహాలో ఏపీలోనూ రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
ఏపీలో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటే అవి ఎవరివో కావు.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌లో చంద్రబాబు నాయుడు ఫోన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబ సభ్యులతోపాటు.. టీడీపీకి చెందిన ముఖ్య నాయకుల పోన్లను కూడా ట్యాప్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే గత పదేళ్లుగా తెలంగాణలో ఫోన్ ట్యాప్ చేశారని.. అందుకు పాల్పడిన వారిలో డీసీసీ స్థాయి నుంచి సీఐ స్థాయి వరకు అరెస్టు చేసి తెలంగాణ ప్రభుత్వం విచారిస్తోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కోసం వాడిన సాఫ్ట్‌వేర్‌నే ఏపీలోని అధికారులు కూడా ఉపయోగిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఇంటిలిజెన్స్ బాస్ ఈ వ్యవహారంలో ముఖ్య భూమిక పోషిస్తున్నట్టు టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రహాస్య ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్‌తోపాటు.. టీడీపీ ముఖ్య నేతల ట్యాపింగ్ వివరాలను రికార్డులతో సహా ప్రతిరోజు సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్‌కి పోలీసులు చేరవేస్తున్నట్టు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనే ఫోన్ ట్యాపింగ్‌లపై అధికార వైసీపీ నేతలను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కొంతమంది ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు అధికార పార్టీ నేతలు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ఫోన్‌తోపాటు.. ఆయన కుటుంబ సభ్యులు.. మరికొంత మంది టీడీపీ ముఖ్య నేతల ఫోన్లను కూడా జగన్ సర్కార్ ట్యాప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయడం వల్ల వారి రాకపోకల.. వారు ఎవరితో మాట్లాడుతున్నారు.. ఎవరెవరూ.. వారితో టచ్‌లో ఉన్నారనే విషయాలను వైసీపీ తెలుసుకునే అవకాశం ఉంది. వాటి ఆధారంగా తమ వ్యూహాలను మార్చుకోవచ్చనే యోచనతోపాటు.. టీడీపీ వారిని దెబ్బకొట్టాలనే కుట్రతోనే ఫోన్ ట్యాపింగ్‌కి జగన్ సర్కార్ పాల్పడుతోందని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.











