అప్పుడెప్పుడడో 2019 సార్వత్రికలకు ముందు.. బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, బీజేపీల మధ్య కొనసాగిన మాటల యుద్ధం గుర్తుంది కదా. సరే.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ గొడవ అలా సద్దుమణిగిపోయింది. తాజాగా ఈ తరహా యుద్ధాన్నే తమిళ స్టార్ హీరో సూర్య ప్రారంభించేశారు. ఇప్పటికే ఈ దిశగా మోదీ సర్కారుపై సూర్య తనదైన శైలిలో విరుచుకుపడగా.. బీజేపీకి చెందిన తమిళనాడు నేతలు సూర్యకు కౌంటర్ ఇస్తూ సంచలన కామెంట్లు చేశారు. మొత్తంగా నాడు కర్ణాటకలో రచ్చ సాగితే.. ఇప్పుడు తమిళనాట ఈ కొత్త రచ్చకు తెర లేసింది.
ఒక సినిమాకు రెండు సార్లు సెన్సారా?
ఇప్పటికే వ్యవసాయ రంగంలో కొత్త చట్టాలను తీసుకువచ్చిన మోదీ సర్కారు పెద్ద ఎత్తున నిరసనలను ఎదుర్కొంటోంది. అయితే లాభసాటి వ్యవసాయం కోసమే ఈ కొత్త చట్టాలను తీసుకువచ్చామని చెబుతున్న మోదీ సర్కారు వెనక్కు తగ్గటం లేదు. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ చట్టానికి కూడా మోదీ సర్కారు సవరణలు చేసిందట. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఓ సారి సెన్సార్ పూర్తి అయిన సినిమాను అవసరమనుకుంటే మరోమారు కూడా సెన్సార్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ తరహా పద్ధతి ప్రభుత్వ పరంగా మంచి జరుగుతుందని భావించినా.. సినిమా జనాలకు మాత్రం పెద్ద దెబ్బేనని చెప్పక తప్పదు.
ట్వీట్ తో సూర్య నిరసన
సినిమాటోగ్రఫీ చట్టంపై దేశంలో ఏ ఒక్క నటుడు నోరు మెదపకున్నా సూర్య మాత్రం చాలా వేగంగా స్పందంచారు. సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణపై నిరసన వ్యక్తం చేసిన ఆయన తన ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటమే చట్టమని… దాని సర్వతంతువులను కోసం చంపడం కాదు’’ అని సూన్య తనదైన శైలి నిరసనను వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ చూసినంతనే బీజేపీకి చెందిన తమిళనాడు నేతలు సూర్యపై తమదైన రేంజిలో విరుచుకుపడ్డా,రు. సినిమాల్లో నటిస్తే చాలని, సమాజంలోనూ నటించడం మానుకోవాలని కౌంటర్లు సంధించారు.
నీట్ పై గతంలో సూర్య ట్వీట్
ఇదిలా ఉంటే.. గతంలోనూ నీట్ పరీక్షల నిర్వహణపై సూర్య.. మోదీ సర్కారు తీరును నిరసిస్తూ ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో నీట్ పరీక్షలను రద్దు చేయాలని పేర్కొన్న సూర్య.. సమాజంలో పేద, ధనిక అనే రెండు వర్గాలకు వేర్వేరు విద్యావిధానాలు అమలవుతున్న తరుణంలో విద్యార్థుల అర్హతను బేరీజు వేసేందుకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్షా విధానాన్ని అమలు చేయడం ఏమేరకు సమంజసమని సూర్య ప్రశ్నించారు. దీనిపై పెద్దగా విమర్శలేమీ రేకెత్తకున్నా.. సూర్య తాజా ట్వీట్ మాత్రం క్షణాల్లో కాక రేపేసింది. మరి ఈ వివాదం ఎంతదాకా పోతుందో చూడాలి.
Must Read ;- మోదీ బాణం యోగి వైపు.. యోగి శూలం మోదీ వైపు











