ఇప్పుడంతా సోషల్ మీడియాదే రాజ్యం. అటు రాజకీయాలైనా, ఇటు సినిమా అయినా…ఇంకే రంగమైనా కూడా సోషల్ మీడియాలో ఎంట్రీ లేకపోతే… మనగలిగే పరిస్థితి లేదు. ఈ విషయంలో మిగిలిన రంగాల కంటే కూడా పొలిటికల్ రంగం సోషల్ మీడియాను తమదైన శైలిలో వినియోగిస్తోంది. ఈ తరహా మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న తరుణంలో ఏ పార్టీకి ఆ పార్టీ తన సొంత సోషల్ మీడియా వింగ్ లను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ తరహాలోనే ఏపీలోనూ అధికార పార్టీ వైసీపీ, విపక్ష టీడీపీ తమ సోషల్ మీడియా విభాగాల నేతృత్వంలో నిత్యం బిగ్ ఫైట్ కు తలపడుతున్నాయి. గడచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ సోషల్ మీడియాపై వైసీపీ వింగ్ కాస్తంత పైచేయి సాధించినట్టుగా కనిపించినా… ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వింగ్ ముందు వైసీపీ వింగ్ బలాదూరేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరహా పరిస్థితికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ వింగ్ కు బలంగా నిలిస్తే… వైసీపీ నేతల అవకాశవాద రాజకీయాలు ఆ పార్టీ వింగ్ కు శాపంలా మారాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
కష్టపడే వారికి వైసీపీ వింగ్ లో స్థానమేదీ?
నిజమే… పార్టీ కోసం, జగన్ కోసం కష్టపడి పనిచేసే వారు వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో చాలా మందే ఉన్నారు. అంతేకాకుండా కులాభిమానంతో వైసీపీకి అండగా నిలిచే వారు ఆ వింగ్ లో లెక్కలేనంత మంది ఉన్నారన్న వాదనలూ లేకపోలేదు. అయితే మొన్నటికి మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ నుంచి అందే సహకారం కోసం ఏమాత్రం ఎదురు చూడని వైసీపీ సోషల్ యాక్టివిస్ట్, ఆ పార్టీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి శ్యాం కలకడ తనదైన శైలిలో కష్టపడ్డారు. కర్ణాటకలో తాను చేస్తున్న ఉద్యోగానికి కొంతకాలం పాటు సెలవు పెట్టి మరీ సొంత ఖర్చులతో తిరుపతి ఉప బరిలో వైసీపీ గెలుపునకు కృషి చేశారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారినపడ్డారు. అప్పటిదాకా అంతా బాగానే పలకరించినా.. ఎప్పుడైతే కరోనా బారినపడ్డాడో శ్యాంను పలకరించే నాథుడే లేకపోయారు. ఎన్నికలనే కాకుండా ఎప్పుడైనా పార్టీ నుంచి ఆర్ధిక సహకారం ఆశించని శ్యాం… తన ఉద్యోగం ద్వారా వచ్చే వేతనంతో పాటు ఇతరత్రా నిధులను సమకూర్చుకుని మరీ పనిచేశారు. అయితే కరోనా బారిన పడి చివరకు మృతి చెందిన శ్యాంకు పార్టీ నుంచి దక్కిన నిరాదరణ ఇప్పుడు ఆ పార్టీ వింగ్ లో పెద్ద చర్చకే తెర లేపింది. శ్యాం చనిపోయిన 48 గంటలకు గానీ ఆయనకు నివాళి అర్పించే తీరిక పార్టీ కీలక నేతలను దొరకలేదన్న వాదనలు వైరల్ గా మారాయి. అయినా ఇంతగా కష్టపడిన శ్యాంకు ఇదా పార్టీ ఇచ్చే గౌరవం అంటూ వింగ్ లోని ఇతర యాక్టివిస్టులు ఇప్పుడు ఆందోళనలో పడిపోయారు.
Also Read ;- మరో ‘పరీక్ష’లో లోకేష్ సక్సెస్.. జగన్ ఫెయిల్
ఈ తరహాలో లెక్కలేనన్ని ఘటనలు
శ్యాం కలకడకు ఎదురైన అనుభవం వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన హోదాతోనే బయటకు వచ్చిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అధికారం వచ్చేదాకా సోషల్ మీడియా వింగ్ ను బాగానే చూసుకున్న వైసీపీ… అధికారం చేతికందగానే దానిపై అంతగా దృష్టి సారించడం లేదని, కూరలో కరివేపాకు మాదిరిగా తీసిపారేస్తున్నాన్న వాదనలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియాలో ఉత్తరాంధ్ర విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తిని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్రను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి చేతిలో భారీ మోసానికి గురయ్యారట. సర్కారీ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన సాయిరెడ్డికి పెద్ద మొత్తంలో డబ్బు సమర్పించుకున్న ఆ యాక్టివిస్ట్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉందట. అయితే ఈ తరహా ఘటనలు ఇప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ లో లెక్కలేనన్ని ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరి టీాడీపీ వింగ్ పరిస్థితేమిటీ?
వైసీపీ సోషల్ మీడియా వింగ్ తో పోలిస్తే.. టీడీపీ సోషల్ మీడియా విభాగం దినదిన ప్రవర్థమానంగా ఎదిగిపోతోందనే చెప్పాలి. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గానీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గానీ… ఇతరత్రా పార్టీ నేతలు గానీ సోషల్ మీడియా వేదికగా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ పార్టీ వింగ్ వెనువెంటనే రంగంలోకి దిగిపోతుంది. ఆ అంశాన్ని వీలయినంతమేర మందికి చేరేలా చేస్తుంది. అలా టీడీపీ చెప్పాలనుకున్న విషయాన్ని క్షణాల్లోనే అందరికీ చేరిపోయేలా టీడీపీ వింగ్ తనదైన శైలి సత్తా చాటుతోంది. ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియా రాజీ లేని పోరాటమే చేస్తోందని చెప్పాలి. అంతేకాకుండా పార్టీ నుంచి ఈ వింగ్ కు నిత్యం సంపూర్ణ మద్దతు లభిస్తోందని కూడా చెప్పక తప్పదు. ఇటీవలి కాలంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్ తనదైన శైలిలో దూసుకుపోతోంది. దీనికి నిదర్శనంగానే.. విపక్ష పాత్రలో టీడీపీ చేస్తున్న పోరాటం క్షణాల్లోనే జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అవుతోంది. సీఎంగా చంద్రబాబు ఉంటేనే బాగుండేదన్న వ్యాఖ్యలు న్యూట్రల్ వర్గం నుంచి వినిపించడం ఇటీవల బాగా పెరిగిపోయింది. ట్విట్టర్ స్సేసెస్ సెషన్ లో లోకేశ్ వ్యవహరించిన తీరుపై స్వరత్రా హర్షం వ్యక్తమవుతోంది.
టీడీపీ వింగ్ బలం నారా లోకేశే!
టీడీపీ సోషల్ మీడియా బలం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశేనని చెప్పక తప్పదు. పార్టీ అధికారంలో ఉండగానే… మెరికల్లాంటి యాక్టివిస్టులను తీసుకున్న లోకేశ్… పార్టీ సోషల్ మీడియా వింగ్ ను ఓ రేంజిలో ఏర్పాటు చేశారు. ఈ టీంకు అవసరమైన ఏ అంశపైనేనా క్షణాల్లోనే పాజిటివ్ నిర్ణయం వచ్చేస్తుంది. అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా… సమయం పగలైనా, రాత్రి అయినా… చివరకు నడి రేయి అయినా లోకేశ్ స్వయంగా స్పందిస్తున్న వైనం కూడా వింగ్ ను బలీయంగా మార్చేసిందని చెప్పాలి. సోషల్ మీడియా అవసరతను గుర్తించిన లోకేశ్… ఆ వింగ్ కు కావాల్సిన మోరల్ సపోర్ట్ ను ఇవ్వాల్సిన అవసరతను కూడా గుర్తించడం వల్లే ఈ మేర సత్ఫలితాలు సాధ్యమవుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. లోకేశ్ ఇస్తున్న దన్ను కారణంగానే టీడీపీ సోషల్ మీడియా ఓ రేంజిలో దూసుకుపోతోంది. పలితంగా టీడీపీ అంశాలు ట్రెండింగ్ లో ఉంటుంటే… వైసీపీ అంశాలు రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయిని చేరుకోలేక చతికిలబడుతున్నాయి. వెరసి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధం వల్ల చతిలికబడితే… నారా లోకేశ్ దన్నుతో టీడీపీ వింగ్ అంతకంతకూ ఎదుగుతోంది.
Must Read ;- నారా లోకేశ్.. ద లీడర్!











