టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి శాసమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ చేరారు. అయితే ఈయన పార్టీ మారిన మరుక్షణమే టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అపాయింట్‌మెంట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూశానని, అయినా కానీ తనకు సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 నిమిషాల అపాయింట్‌మెంట్ కోసం 2 ఏళ్లుగా ఎదురుచూశానని అన్నారు. ఎప్పుడు మాట్లాడినా రేపు కలుద్దామనేవారు కానీ అస్సలు సమయం ఇచ్చేవారు కాదని కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా రేపు.. రేపు.. అని రెండేళ్లు గడిచాయని, ఆత్మాభిమానం తనకివ్వని చోట నేను పడి ఉండనని స్వామిగౌడ్ పేర్కొన్నారు.
దీంతో పాటు మరో సంచలన వ్యాఖ్యను కూడా స్వామిగౌడ్ చేశారు. ప్రతి ఇంట్లో ముగ్గురు పిల్లలను కనండని మరోసారి సంచలన వ్యాఖ్య చేశారు. గతంలో ఆయన శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఇదే మాట అనడంలో పెద్ద దుమారమే లేచింది. ఇప్పుడు కూడా అదే మాటను స్వామిగౌడ్ మళ్లీ రిపీట్ చేసి సంచలనం లేపారు. దంపతులారా ముగ్గురు పిల్లలు కనండి అన్నారు. తాను పార్టీ మారుతుంటే చాలామంది అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నీకేం తక్కువ చేసిందని. తాను రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చి నన్ను ఛైర్మన్‌ను చేయలేదన్నారు. కొందరు తన గురించి చెప్పే చెప్పుడు మాటలు విని తనను పక్కనబెట్టారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను తిట్టి.. పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే ఆ పార్టీలో చోటుందని ఆరోపించారు. బండి సంజయ్ దమ్మున్న నాయకుడని స్వామిగౌడ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లపై చేయి వేస్తే నీ దారుస్సలాం పగలగొడతానని చెప్పడం అది బండి సంజయ్‌కే సాధ్యమని స్వామి గౌడ్ పేర్కొన్నారు.
Must Read ;- పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు











